Advertisementt

ప్రీ రిలీజ్ ఈవెంట్స్: బాలయ్య అక్కడ-చిరు ఇక్కడ

Sat 31st Dec 2022 10:31 AM
waltair veerayya,chiranjeevi,balakrishna  ప్రీ రిలీజ్ ఈవెంట్స్: బాలయ్య అక్కడ-చిరు ఇక్కడ
Veera Simha Reddy Pre Release Event at Ongole ప్రీ రిలీజ్ ఈవెంట్స్: బాలయ్య అక్కడ-చిరు ఇక్కడ
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుని అదే ఊపులో వీర సింహ రెడ్డిని ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. మాస్ యాక్ల్షన్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన వీర సింహ రెడ్డి పై అభిమానుల్లోనే కాదు.. అశేష ప్రేక్షకజనవాహినిలో అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ లుక్, శృతి హాసన్ తో ఆయన వేస్తున్న డాన్స్ అన్ని సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. అటు సాంగ్స్ అభిమానులని ఊపేస్తున్నాయి. రిలీజ్ కి దగ్గరవుతున్న వీరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం పెట్టారు మేకర్స్. జనవరి 6 సాయంత్రం ఒంగోలులో వీర సింహ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వేలాదిమంది అభిమానుల మధ్యన నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ ని భారీగా నిర్వహించాలని చూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి అతిధిగా ఎవరు వస్తారో అనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.

ఇక ఆచార్య డిసాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ తో మర్కెట్ ని నిలబెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి కొల్లి బాబీ డైరెక్షన్ లో పూనకాలు లోడింగ్ అంటూ అడుగడుగునా ఆసక్తిని క్రియేట్ చేస్తున్న వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ కూడా పీక్స్ లో ఉన్నాయి. హిందీలోనూ భారీగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడు. చిరు గ్యాంగ్ లీడర్ ని రీ క్రియేట్ చేస్తూ అభిమానుల్లో అంచనాలు కలిగిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జనవరి 8 న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. 

అలా ఈ సంక్రాంతి పుంజులు బాలయ్య-చిరు లు అభిమానుల ఆనందం కోసం, ఈవెంట్స్ ని ఏర్పాటు చేసి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య ఒంగోలు వేదికగా ఫాన్స్ ని ఉర్రుతలూగించబోతుంటే.. చిరు వైజాగ్ వేదికగా ఫాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నారు.

Veera Simha Reddy Pre Release Event at Ongole:

Waltair Veerayya Pre Release Event at Vizag

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ