2022 గ్రాండ్ గా ముగుస్తుంది.. ఈ చివరి వారం ఏదో ఒక సినిమా హిట్ అవుతుంది అని అటు సినిమా ఇండస్ట్రీ, ఇటు ఆడియన్స్ ఎదురు చూసారు. ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా పొలోమని సినిమాలు బాక్సాఫీసు దండయాత్రకు దిగాయి. గత వారం 18 పేజెస్, ధమాకా సో సో టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టడంతో ఈవారం వచ్చే సినిమాలపై ప్రేక్షకులు కొద్దిగా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. అందులో ఆది సాయి కుమార్ టాప్ గేర్ తో ప్రమోషన్స్ పరంగా అందరిలో క్యూరియాసిటీ కలిగించాడు. కానీ ఆది సాయి కుమార్ టాప్ గేర్ అంటూ స్పీడు బ్రేకర్లు ఎక్కించాడంటూ ఆడియన్స్ ఫీలవుతున్నారు. క్రిటిక్స్ కానీ, ఆడియన్స్ కానీ ఎవ్వరూ టాప్ గేర్ పై పాజిటివ్ గా స్పంచించడం లేదు.
ఇక బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ లక్కీ లక్ష్మణ్ పై హైప్ పెంచాలనే ఉద్దేశ్యంతో తన ఫ్యామిలీని ట్రోల్ చేసిన వారిని నాకొడకల్లారా.. వెతికి వెతికి ఇంటికొచ్చి మరీ తంతానంటూ వార్నింగ్ ఇచ్చిపడేసాడు. ఆ కామెంట్స్ కి వేలల్లో లైక్స్, లక్షల్లో షేర్లు వచ్చినా లక్కీ లక్ష్మణ్ మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. లక్కీ లక్ష్మణ్ కి ఆడియన్స్ అలాగే క్రిటిక్స్ ఇద్దరూ ఒకేలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇక తారక రత్న S5, రాజయోగం, కోరమీను ఏదో కాస్త హడావిడి చేసినా.. ఆడియన్స్ పట్టించుకోలేదు.
ఆఖరికి హాట్ స్టార్ ఓటిటి నుండి డైరెక్ట్ గా రిలీజ్ అయిన అనుపమ పరమేశ్వరన్ బట్టర్ ఫ్లై కూడా ఓ వర్గం ప్రేక్షకులకి నచ్చినా.. మిగతా వారు పెదవి విరిచారు.. ఇలా ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయిన చిన్న సినిమాలేవీ ప్రేక్షకులని ఆకట్టుకోకపోగా.. ఈ ఏడాది ఫైనల్ గా డిసాస్టర్ వీక్ తో భారంగా ముగింపు చెప్పాల్సి వచ్చింది.