బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఇన్స్టా రీల్స్ తోనూ, యూట్యూబ్ వీడియోస్ తో గలాటా గీతూగా ఫెమస్ అయ్యి ఈటీవిలోకి జబర్దస్త్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్ బిగ్ బాస్ లోకి వచ్చాక చిత్తూరు యాసతో అదరగొట్టేసింది. ఆమెకున్న వాయిస్ పవర్, అలాగే విపరీతమైన తెలివితేటలూ బుల్లితెర ప్రేక్షకులకి నచ్చినా.. బిగ్ బాస్ యాజమాన్యం తట్టుకోలేక ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది అనుకుని.. టాప్ 5 వరకు ఉంటుంది అనుకున్న ఆమెని మధ్యలో ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు. ఇక బిగ్ బాస్ అంటే ప్రాణమంటూ కన్నీళ్లు పెట్టుకున్న గీతూని చూసి బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫీలయ్యారు.
తాజాగా గీతూ చిత్తూరులో జరిగిన ఓ ఈవెంట్ కి వెళ్లి అక్కడ బిగ్ బాస్ లోకి వెళ్ళొచ్చాను, నేనంటే ఇంత అభిమానం ఏందీ సామి.. అంటూ ఫాన్స్ తో ఫొటోస్ దిగిన గీతూ తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లుగా చెప్పి షాకిచ్చింది. ప్రజా సేవ చెయ్యడానికి త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాను, కాకపోతే ప్రజల కోరిక మేరకు ఏ పార్టీలోకి వెళ్లాలో ఆలోచించుకుంటాను, ప్రస్తుతం అయితే ఏ పార్టీలో చేరాలని అనుకోలేదంది.
బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక రాజకీయాల్లో ఉన్న లోతుపాతులు తెలుసుకుంటున్నాను, ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలని చూస్తున్నాను, పదవులపై కోరిక లేదు, ఎన్నికల్లో పోటీ చేసేంత పెద్దదాన్ని కాదు, తాను బిగ్ బాస్ లో చెప్పినట్టుగా రూలర్ కావాలని, రాజకీయాలని రూల్ చెయ్యాలని ఉంది అంటూ పొలిటికల్ ఎంట్రీ పై బిగ్ బాస్ గీతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.