జబర్దస్త్ లో హైపర్ ఆది నెంబర్ 1 పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సుడిగాలి సుధీర్ కూడా ఆది తర్వాత ఉండాల్సిందే. అంతలాంటి పంచ్ లతో, క్రేజీ కామెడీతో ఆది అభిమాన గణాన్ని పోగేసుకున్నాడు. హైపర్ ఆది స్కిట్ చేస్తే 10/10 కొట్టాల్సిందే, తన టీమ్ మేట్స్ తో కలిసి హైపర్ ఆది జబర్దస్త్ ని లీడ్ చేసే స్థాయిలో ఉండగా.. ఆది కొన్నాళ్ళు జబర్దస్త్ కి విరామం ప్రకటించి ఈమధ్యనే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అలాంటి హైపర్ ఆది పై మరో కమెడియన్ సద్దాం జీ ఛానల్లో అదిరింది కామెడీ షోలో వేసిన పంచ్ లు బాగా పాపులర్ అయ్యాయి. అప్పట్లో సద్దాం ఆదితో పోల్చుకున్నాడు. అయితే సద్దాం కూడా అదిరింది ప్రోగ్రాంలో మంచి ఫెమస్ అయ్యాడు. తర్వాత హైపర్ ఆది సద్దాం పై ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా చేసాడు.
తన స్కిట్స్ కి యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఒక్కసారి చూస్తే ఎవడు గొప్పో అర్ధమవుతుంది అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి కూడా. అప్పట్లో హైపర్ ఆది ఫాన్స్ సద్దాం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే వీరిద్దరి మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది అనే ప్రచారాన్ని హైపెర్ అది నిజం చేసాడు. తనకి సద్దాం కి మధ్యన కొన్ని మనస్పర్థలు ఉన్నాయనే విషయాన్ని రివీల్ చేసాడు. 2022 లో ఇద్దరి మధ్యన చిన్న చిన్న విభేదాలు వచ్చాయి. అవి 2023 లో సద్దుమణగాలని కోరుకుంటున్నాను అంటూ హైపర్ ఆది న్యూ ఇయర్ పార్టీ రోజున రాబోయే ప్రోగ్రామ్ లో చెప్పడం గమనార్హం.
ఈటీవీలో రాబోతున్న ద పార్టీ ప్రోగ్రాంలో హైపర్ ఆది సద్దాం తో తనకున్న మనస్పర్థలు రివీల్ చేసి.. అవి సద్దుమణగాలని కోరుకున్న ప్రోమో విడుదల చేసింది. ప్రస్తుతం సద్దాం జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన స్కిట్స్ తో బాగానే నవ్విస్తున్నాడు.