బిగ్ బాస్ సీజన్ 1 విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకోగా.. సీజన్ 2, సీజన్ 3 బావున్నాయని బుల్లితెర ప్రేక్షకులు ఆదరించారు. కానీ సీజన్ 4 నుండి బిగ్ బాస్ కి ఆడియన్స్ తగ్గారు. కారణం షోలో ఉండాల్సిన ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, అలాగే పేరున్న సెలబ్రిటీస్ బిగ్ బాస్ లోకి రాకపోవడం, బిగ్ బాస్ లీకులు.. ఇలా బిగ్ బాస్ పై క్రేజ్ తగ్గడానికి కారణమయ్యాయి. అసలు ఈసారి సీజన్ 6 పై ఎలాంటి ఇంట్రెస్ట్ జనాల్లో కనిపించలేదు. నాగార్జున హోస్టింగ్ పై కూడా విమర్శలు ఎక్కువయ్యాయి. చాలా చప్పగా ఈ సీజన్ ముగిసింది.
అసలు బిగ్ బాస్ సీజన్ 6 మొదలైన ఓపెనింగ్ ఎపిసోడ్ కే పెద్దగా TRP తెచ్చుకోలేక చతికిల పడిన ఈ షో.. మధ్యలో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అలాగే క్రేజీ కంటెస్టెంట్స్ ని మధ్యలోనే ఎలిమినేట్ చెయ్యడం కూడా బుల్లితెర ప్రేక్షకులకి రుచించలేదు. అంతేకాకుండా వీకెండ్ ఎపిసోడ్స్ లీకులు, 24/7 లైవ్ ఇవన్నీ ఈ సీజన్ ని దెబ్బేసాయి. ఈ సీజన్ కి ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందొ అనేది సీజన్ 6 గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ TRP చూస్తే తెలుస్తుంది. గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ కి 8.86 TRP రాగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు అంతకంటే తక్కువ స్థాయిలో 8.17 TRP వచ్చింది.
ఈ TRP చూస్తే ఈజీగా అర్ధమవుతుంది.. బిగ్ బాస్ సీజన్ 6 కి ఎంత క్రేజ్ ఉందొ అనేది. దీనిని బట్టి తెలుగులో బిగ్ బాస్ ఏ స్థాయిలో పడిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.