బిగ్ బాస్ సీజన్ 6 లోకి క్రేజీ గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ కే పాఠాలు నేర్పి బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాను, బిగ్ బాస్ ని రూల్ చేస్తాను అంటూ విర్ర వీగిన గీతూ రాయల్ ఏమాటకామాటే చెప్పుకోవాలి.. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా ఆమెకి పేరు పెట్టడానికి లేదు. రివ్యూయర్ ఆది రెడ్డి తోనే కాకుండా ఫైమా, శ్రీహన్ లతో ఫ్రెండ్ షిప్ చేసి.. చిత్తూరు యాసతో ఆకట్టుకుని, అనుకోకుండా, ఊహించకుండా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ స్టేజ్ పై ఏడ్చి ఏడ్చి బయటికి వచ్చిన గీతూ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వరకు ఏడుస్తూనే ఉంది.
బిగ్ బాస్ నుండి అప్పుడే బయటికి వస్తాను అని ఊహించలేదు అంటూ బిగ్ బాస్ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏడ్చేసే గీతూ రీసెంట్ గా చిత్తూరు వెళ్ళింది. అక్కడ ఓ ఈవెంట్ లో పాల్గొన్న గీతూతో సెల్ఫీలు దిగేందుకు అందరూ పోటీ పడ్డారు. అయ్యా సామి ఎందుకింత అభిమానం నా మీద, నేను చిత్తూరు నుండి 15 ఏళ్ళ క్రితమే వెళ్లిపోయాను, అయినా నన్ను చిత్తూరు బిడ్డగా ప్రేమిస్తున్నారు, ఇక్కడ పెరగకపోయినా.. చిత్తూరు యాసను ఒంటబట్టించుకున్నాను అని చెప్పిన గీతూ బిగ్ బాస్ గురించి కూడా కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ కి వెళ్లి తాను రెండు విషయాలు నేర్చుకున్నాను అని.. అది మనం తప్పు చెయ్యకపోతే ఎదుటివారు ఎంత తొపైనా తగ్గేదేలే అని, అదే మనం తప్పు చేశామనిపిస్తే.. చిన్న పిల్లలకైనా క్షమాపణ చెప్పాల్సిందే అని తాను నేర్చుకున్నాను అంటూ గీతూ ఆ ఈవెంట్ లో చెప్పింది.