అల్లు అరవింద్ ఆహా ఓటిటి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రేంజ్ క్రేజ్, ఈ రేంజ్ హైప్ ఎప్పుడూ ఉండి ఉండదేమో.. డైరెక్ట్ గా సినిమాలు రిలీజ్ చేసినా, వంట ప్రోగ్రామ్స్ పెట్టినా, కామెడీ షోస్ చేసినా, అన్ స్టాపబుల్ టాక్ షో అంటూ బాలయ్యతో అదిరిపోయే టాక్ షో నడిపించినా ఇన్ని అంచనాలు, ఇంత క్రేజ్ రాలేదు. కానీ ఇప్పుడు ఆహా ఓటిటి యూజర్స్ కి షాక్ తగిలింది. ఆహా ఓటిటి క్రాష్ అయ్యింది. కారణం ఇంకెవరు ప్రభాస్. ప్రభాస్-బాలయ్యల బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 డార్లింగ్ అభిమానుల కోరిక మేరకు ఒక రోజు ముందే డిసెంబర్ 29 నైట్ 9 గంటలకే స్ట్రీమింగ్ లోకి తెచ్చేసింది ఆహా టీం.
మరి ప్రభాస్ ఫాన్స్ ఆగుతారా.. వారు ఆహా ఓటిటి ఓపెన్ చేసి కొట్టి కొట్టి మొత్తానికి మిగతా ఆడియన్స్ కి ఓపెన్ కాకుండా క్రాష్ చేసారు. ప్రభాస్ ఫాన్స్ ఇలాంటిదేదో చేస్తారు, ఈ రోజు ఆహ ఓటిటి సబ్ స్క్రైబర్స్ తో టీవీలు షేకవడం, ఫోన్ లు పగిలిపోవడం ఖాయమని ముందే ఊహించినట్టే జరిగింది. ఈ రోజు 9 గంటలకి ఆత్రంగా ఓటిటి ఆన్ చేస్తే.. అలా చక్రం తిరిగుతుంది కానీ.. ఓపెన్ అవ్వడం లేదు, టీవీలోనూ అదే పరిస్థితి ఫోన్ లోను అదే పరిస్థితి.
డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్ ఆహాని షేక్ చేసారు. కనీసం 9.30 నిమిషాలకి అయినా ఓపెన్ చేద్దామని చేస్తే.. ఆహా ఓటిటిలోకి వెళ్లి నిరాశగా వెనక్కి వస్తున్నారు ప్రేక్షకులు. డార్లింగ్.. అనుకున్నదే అయ్యింది, నీ క్రేజ్ తో ఆహా ఓటిటి యూజర్స్ కి ఇంత పెద్ద షాకిస్తావా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తుంటే.. అయ్యయ్యో ప్రభాస్ ఎపిసోడ్ చూడలేకపోతున్నామని కొంతమంది తెగ ఫీలైపోతున్నారు.