టాలీవుడ్ లోకి పెళ్ళిసందD మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ శ్రీలీలకి అదృష్టం మాములుగా పట్టలేదు. ఇప్పుడు టాలీవుడ్ శ్రీలీల జపం చేస్తుంది. ఆమెకి డిసాస్టర్ పడినా అవకాశాలు వచ్చాయి, ప్లాప్ అన్న సినిమాని శ్రీలీల హిట్ చేసే కెపాసిటీ రెండో సినిమాకే తెచ్చుకుంది. ధమాకా ప్లాప్ అన్నారు, అస్సలు బాలేదన్నారు, రొటీన్ అన్నారు, కానీ ఇప్పుడు అందరూ శ్రీలీల గురించే మాట్లాడుతున్నారు. ఆమె డాన్స్ అలా ఉంది, ఆమె గ్లామర్ ఇలా ఉంది. డాక్టర్ చదివిన సాయి పల్లవిలాగే డాక్టర్ చదువుతూ శ్రీలీల కూడా హీరోయిన్ గా దున్నేస్తుంది అంటూ చర్చలు మొదలు పెట్టారు.
ఇప్పటికే అరడజను సినిమాలు చేతిలో ఉన్న శ్రీలీల డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ధమాకా రిజల్ట్ తో సంబంధం లేకుండానే శ్రీలీల క్రేజ్ మార్మోగిపోవడంతో తన పారితోషకాన్ని అమాంతం పెంచేసిందట. ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్ట్ లకి అదనంగా ఛార్జ్ చెయ్యడం స్టార్ట్ చేసిందట. తాను ముందు మట్లాడుకున్న పారితోషానికి ఇంత అని యాడ్ చెయ్యమని మొహమాటం లేకుండా నిర్మాతలని అడిగేస్తుందట ఈ కుర్ర బ్యూటీ. గ్లామర్ గా కనిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, క్రేజ్ ఉంది పెంచమని డిమాండ్ చేస్తుందట.
ఇప్పటికే కోటి - కోటిన్నర మధ్యన ఉన్న శ్రీలీల ధమాకా దరువుతో అది 2 కోట్ల మార్క్ కి చేరిందట. కొత్తగా దర్శకనిర్మాతలు ఎవరు అప్రోచ్ అయినా శ్రీలీలకి 2 కోట్లు ఇస్తేనే ఆమె ఓకె చేస్తుంది లేదంటే.. మరొక హీరోయిన్ ని వెతుక్కోవాల్సిందే. డిమాండ్ అలా ఉంది. ఆమె చెప్పింది నిర్మాతలు చెయ్యక చస్తారా!