Advertisementt

2022 కి 2 పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది

Thu 29th Dec 2022 06:25 PM
2022,kgf 2,karthikeya 2,hit 2  2022 కి 2 పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది
The Best Movie Sequels of 2022 2022 కి 2 పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది
Advertisement
Ads by CJ

2 తప్ప వేరే ఏ ఇతర అంకె లేని 2022 సంవత్సరం విచిత్రంగా 2వ భాగం చిత్రాలకు భలే కలిసొచ్చింది.. అంతేకాదు భారీగా కాసులిచ్చింది. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి కొనసాగింపుగా సంక్రాంతికి  వచ్చిన నాగార్జున-నాగ చైతన్య లు బంగార్రాజుతో ఈ సీక్వెల్స్ సందడి ఆరంభం కాగా సమ్మర్ కి వచ్చిన KGF 2తో ఆ సంబరం అంబరాన్ని తాకింది. కన్నడ నుండి యాష్-ప్రశాంత్ నీల్ లు పెను పాన్ ఇండియా సంచలనం KGF కి సీక్వెల్ కా KGF 2 కాసుల వర్షం కురిపించింది. ఆపై వచ్చిన F2 సీక్వెల్ F3 కూడా కావాల్సిన కలెక్షన్లు కొల్లగొట్టింది. 

ఇక నిఖిల్ కార్తికేయపై సీక్వెల్ గా తెరకెక్కి చిన్న చిత్రంగా విడుదలైన కార్తికేయ-2 ఎంతటి పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మనకే కాదండోయ్.. సరైన హిట్టు సినిమా ఇవ్వలేక బావురుమంటున్న బాలీవుడ్ కూడా ఈ ఏడాది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్స్ పొందగలిగింది భూల్ భూలయా 2, దృశ్యం 2 చిత్రాలతోనే.! 

నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన హిట్ సినిమాకి సీక్వెల్ గా ఈ నెల మొదటి వారంలో అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ - 2 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. ఆ సినిమా నిర్మాతగా నాని కి, హీరోగా అడివి శేష్ కి అద్భుతమైన హిట్ ఇవ్వడంతో.. ఈ ఏడాది 2022 లో ఈ సీక్వెల్స్, 2 సెంటిమెంట్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యి హీరోలని స్టార్స్ ని చెయ్యగా, నిర్మాతలకు కాసులు పంట పండించింది. 

The Best Movie Sequels of 2022:

2022 was the year of some great sequels

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ