Advertisementt

పవన్, మహేష్ ముంచేశారు: దిల్ రాజు

Thu 29th Dec 2022 04:43 PM
dil raju,mahesh babu,pawan kalyan  పవన్, మహేష్ ముంచేశారు: దిల్ రాజు
Pawan, Mahesh flops would have led to suicide: Dil Raju పవన్, మహేష్ ముంచేశారు: దిల్ రాజు
Advertisement
Ads by CJ

దిల్ రాజు ప్రస్తుతం వారసుడు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. వారసుడు విడుదల విషయంలో అలాగే థియేటర్స్ పంపకాల విషయంలో, ఓ డబ్బింగ్ సినిమాని తెలుగు సినిమాలపైకి రిలీజ్ చేసే విషయంలో వివాదాలు ఎదుర్కుంటున్న దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా తనని పవన్ కళ్యాణ్, మహేష్ సినిమాలు ముంచేశాయంటూ సంచలనంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, మహేష్ బాబు స్పైడర్ మూవీస్ ని కొని నష్టపోయాను, ఆ నష్టాలూ భరించలేక వేరొకరైతే సూయిసైడ్ చేసుకుంటారు అంటూ దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కిన అజ్ఞాతవాసిపై ఉన్న అంచనాలతో 27 కోట్ల ఫ్యాన్సీ రేటుకి నైజాం రైట్ దక్కించుకుంటే.. ఆ సినిమా ఘోరమైన డిసాస్టర్ అయ్యింది. అదే విధంగా మురుగదాస్-మహేష్ కలయికలో తెరకెక్కిన స్పైడర్ కూడా దిల్ రాజుకి అంతే డిసాస్టర్ కలెక్షన్స్ ఇచ్చింది. అంత దారుణమైన పరిస్థితులని 2017లో తనకు నిర్మాతగా వరుసగా హిట్లు వచ్చి ఉండటంతో ఆ నష్టాలను తట్టుకొని నిలబడగలిగానని దిల్ రాజు చెప్పాడు.

2017లో దిల్ రాజు బ్యానర్ లో శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ వంటి చిత్రాలు తెరకెక్కి విజయం సాధించాయి. దానితో తాను నిలదొక్కుకున్నాను, అదే వేరేవారన్నా అయితే.. సినిమా ఇండస్ట్రీ వదిలిపారిపోవడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో చేసేవారని, కానీ తాను ఆలా నిలదొక్కుకున్నాను అంటూ దిల్ రాజు పవన్, మహేష్ సినిమాలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Pawan, Mahesh flops would have led to suicide: Dil Raju:

Dil Raju: If Anyone Else Would Have Committed Suicide

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ