ఆహా ఓటిటిలో సూపర్ సక్సెస్ అయ్యి టాక్ షోలకే రారాజుగా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించిన అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సూపర్ బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణే. అరవింద్ గారు ప్లాన్ చేసి సెలబ్రిటీస్ ని బాలయ్య ఎదురుగా కూర్చోబెట్టి ఆట ఆడించి, పర్సనల్ విషయాలను చెప్పించి షో పై విపరీతమైన హైప్ క్రియేట్ చేసారు. అలాగే అన్ స్టాపబుల్ షూటింగ్ గురించి ఆ ఎపిసోడ్ వచ్చేవరకు బయటకి లీక్ అవ్వకుండా ఆహా టీం జాగ్రత్తలు తీసుకుంటుంది.
కానీ అన్ స్టాపబుల్ సీజన్2 లో ఈ లీకులు మొదలై షో మీద క్రేజ్ తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభాస్ షూటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్న టీమ్.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ విషయంలో ఆ జాగ్రత్తలు గాలికి వదిలేసినట్టుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ షోలోకి వెళ్ళింది మొదలు అక్కడ ఏం జరిగిందో అనే విషయం సాయంత్రానికల్లా పలు వెబ్ సైట్స్ లో వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు, బాలయ్య -పవన్ బాండింగ్, పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలు ఏం మట్లాడారో అనే విషయాల్ని సాయంత్రానికి లీకైపోయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
మరి ఇలా లీకులు వచ్చేస్తే ఎపిసోడ్ పై ఎలాంటి ఆసక్తి ఉండదు. అందుకే అరవింద్ గారు ముందు ఈ లీకులు ఆపండి లేదంటే.. బిగ్ బాస్ షో బలైనట్టుగా అన్ స్టాపబుల్ షో కూడా నీరసించిపోతుంది.. ఈ లీకులు ఆపితేనే మీకు వర్కౌట్ అవుతుంది లేదంటే కష్టమే అంటూ ఆహా టీమ్ కి అరవింద్ కి అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.