Advertisementt

బాలయ్యతో ఎన్టీఆర్ మోత మోగిపోవాల్సిందే

Wed 28th Dec 2022 10:24 PM
ntr,kalyan ram,balakrishna,unstoppable  బాలయ్యతో ఎన్టీఆర్ మోత మోగిపోవాల్సిందే
NTR, Kalyan Ram and its Balakrishna in Unstoppable show? బాలయ్యతో ఎన్టీఆర్ మోత మోగిపోవాల్సిందే
Advertisement
Ads by CJ

మెగా హీరోలు ఒకే చోట కలిస్తే మెగా ఫాన్స్ కి పండగే కానీ.. మిగతా ప్రేక్షకులకి పెద్దగా ఇంట్రెస్ట్ గా అనిపించదు. అదే నందమూరి హీరోలు ఒక చోట కలిస్తే నందమూరి ఫాన్స్ కి పూనకాలే, సాధారణ ఆడియన్స్ కి అరుపులే. బాలకృష్ణ -జూనియర్ ఎన్టీఆర్ కాస్త డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తారు. అందుకే వీరిద్దరూ కలిసి కనబడ్డారంటే ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి. వీరిద్దరూ కలిసి ఒకే స్టేజ్ పై టాక్ షోలో పాల్గొంటే.. ఆ అంచనాలు కొలమానంలో కొలవడమూ కష్టమే. నిన్న మంగళవారం మెగా హీరో పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ షూట్ కే హైదరాబాద్ దద్దరిల్లిపోయింది. అభిమానుల అరుపులతో హైదరాబాద్ నడిబొడ్డున జాతరని తలపించారు.

అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వస్తే.. ఆ జాతర మరింతగా పెరిగిపోతుంది. కాదు మోత మోగిపోవాల్సిందే. ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ ముందు సోఫాలో కూర్చుని ఈ షో లో పాల్గొంటే.. ఆహా ఓహో చూడడానికి రెండు కళ్ళు చాలవు, ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ కూడా వస్తే.. ఇంకాస్త ఆనందం. మరి ఈ రేర్ కాంబినేషన్ ని కూడా అల్లు అరవింద్ సెట్ చేసినా చేసేయ్యొచ్చు. చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

మరి ఎన్టీఆర్-బాలయ్య కలిపి ఈ షోలో కనిపిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు కన్నుల పండుగే. నందమూరి అభిమానుల ఆశ, కల కూడా నెరవేరుతుంది. ఎన్టీఆర్ ఫాన్స్ డిమాండ్ కూడా ఇదే... ఎన్టీఆర్ ని బాలయ్య షోకి రప్పించమని, మరి ఇది జరుగుతుందా అనేది పక్కనబెడితే.. జరిగితే అని ఊహించుకుంటనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. 

NTR, Kalyan Ram and its Balakrishna in Unstoppable show?:

Ntr & Kalyan Ram Joins Balakrishna In Unstoppable 2..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ