Advertisementt

బ్రేకింగ్: చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట

Wed 28th Dec 2022 09:20 PM
chandrababu,kandukur sabha  బ్రేకింగ్: చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట
Chandrababu Road Show at Kandukur బ్రేకింగ్: చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట
Advertisement
Ads by CJ

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న కందుకూరు రోడ్ షో, బహిరంగ సభలో అనుకోకుండా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందడం కలకలం సృష్టించింది. చంద్రబాబు నాయుడు ప్రసంగం చేస్తుండగా..  ఒక్కసారిగా ముందుకు వచ్చిన కార్యకర్తలు ఈ తొక్కిసలాటలో పక్కనే ఉన్న కాలువలో పడిపోవడం, కిందవున్న వారికి ఊపిరి అందక ఏడుగురు టిడిపి కార్యకర్తలు మృత్యువాత పడగా.. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు హుటాహుటిన బహిరంగ సభ నుండి గాయపడిన వారిని తరలించిన ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు.

కందుకూరు సభ ప్రాంగణం, రోడ్స్ అన్నీ ఇరుకుగా ఉన్నప్పటికీ టీడీపీ కార్యకర్తలతో పసుపు మయంగా మారడం, కార్యకర్తలు లెక్కకు మించి ఈ సభకి, రోడ్ షోకి హాజరవడం, అలాగే అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. తొక్కిసలాటలో చనిపోయిన కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు పది లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. కార్యకర్తల మృతిపై దిగ్బ్రాంతికి గురైన చంద్రబాబు కార్యకర్తల కుటుంబాలకి అండగా ఉంటామని, మృతుల కుటుంబాలకి ఆయన సంతాపం తెలియజేసారు. 

కందుకూరు బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయాలపాలవగా.. అందులో ఏడుగురు చనిపోయారు, మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

Chandrababu Road Show at Kandukur :

7 Dead In Chandrababu Kandukur Sabha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ