Advertisementt

అడివి శేష్ గూఢచారి 2 వచ్చేస్తుంది

Wed 28th Dec 2022 07:28 PM
adivi sesh,goodachari 2  అడివి శేష్ గూఢచారి 2 వచ్చేస్తుంది
Adivi Sesh to make a major announcement అడివి శేష్ గూఢచారి 2 వచ్చేస్తుంది
Advertisement
Ads by CJ

గూఢచారి మూవీ తో అడివి శేష్ టాలీవుడ్ లో థ్రిల్లర్ కాన్సెప్ట్ హీరో అయ్యాడు. గూఢచారి ఇప్పటికీ టివిలో వస్తుంటే.. ఫ్యామిలీ ఆడియన్స్, అలాగే ఆ జానర్ ని ఇష్టపడేవారు చూడకుండా ఉండలేరు. అడివి శేష్ పెరఫార్మెన్స్, ఎమోషన్స్, లవ్, మోసం అన్నిటిని కలిపి ఆడియన్స్ ని మెప్పించారు. గూఢచారి ఎండ్ లోనే దీనికి సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించి ఆసక్తి రేపిన అడివి శేష్ దానిని వదిలేసి.. ఎవరు, మేజర్, హిట్ 2 వంటి చిత్రాలతో హిట్స్ కొట్టుకుంటూ మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు.

ఈమధ్యనే హిట్ ద సెకండ్ కేస్ తో హిట్ కొట్టిన అడివి శేష్ తదుపరి మూవీపై పై సస్పెన్స్ మొదలయ్యింది. శేష్ కూడా త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానని చెప్పాడు. ఈరోజు అడివి శేష్ సోషల్ మీడియాలో తన నెక్స్ట్ మూవీ అప్ డేట్ రేపు గురువారం రాబోతున్నట్టుగా ప్రకటించిన కొద్దిసేపటికే AK ఎంటర్టైన్మెంట్ నుండి కొత్త సినిమా అప్ డేట్ రేపే అంటూ ప్రకటించడంతో గూఢచారి కి సీక్వెల్ ప్రకటిస్తారని కన్ ఫర్మ్ అవడమే కాదు, గూఢచారి లవర్స్ గూఢచారి 2 ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

మరి గూఢచారి 2 లో కూడా నాగార్జున మేనకోడలు సుప్రియ, ప్రకాష్ రాజ్ లు కంటిన్యూ అవుతారా.. లేదంటే కొత్త వాళ్ళని యాడ్ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే స్టోరీపై కూడా అప్పుడే అందరిలో ఆత్రుత పెరిగిపోతుంది. రేపు అడివి శేష్ చెప్పబోయే గుడ్ న్యూస్ కోసం ఆయన ఫాన్స్ వెయిటింగ్.

Adivi Sesh to make a major announcement:

Adivi Sesh to spring a surprise

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ