టాప్ సెలెబ్రిటీ యాంకర్ సుమ కనకాల యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వాలనుకుంటుంది అని కొందరు, కాదు యాంకరింగ్ కి ఆమె గుడ్ బై చెప్పెయ్యబోతుంది అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చెయ్యడానికి కారణం సుమ ఇటీవల ఓ ఛానల్ లో న్యూ ఇయర్ స్పెషల్ గా రాబోతున్న ఓ షోలో కాస్త ఎమోషనల్ అవుతూ మలయాళీ అయిన నన్ను తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టి చూసుకున్నారు, కొన్నాళ్ళు యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టుగా చెప్పి ఎమోషనల్ అయిన ప్రోమో వైరల్ అయ్యింది. దానితో సుమ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుంది, కాదు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ సగం సగం వార్తలు ప్రచారం చేసారు.
దానితో సుమ కనకాల యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తుందా అని బుల్లితెర అభిమానులు బాధపడుతుంటే.. ఆమె ఫ్రెండ్స్, సన్నిహితులు సుమకి ఫోన్ చేసి మరీ సుమని ఏంటి విషయం అని ఆరాతీస్తున్నారట.
అదే విషయాన్ని సుమ చెబుతూ నేను బుల్లితెర షోస్ కి, యాంకరింగ్ కి గుడ్ బై చెబుతున్నాను అంటూ నాకు కొన్ని ఫోన్ వస్తున్నాయి. వాటిని ఆన్సర్ కూడా చెయ్యలేకపోతున్నాను. ఈమధ్యనే న్యూ ఇయర్ ప్రోగ్రాం చేసాం, ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో నేను కొంత ఎమోషనల్ అయిన మాట వాస్తవమే. కానీ ఆ ఈవెంట్ ఫుల్ గా చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. నాకు మెసేజెస్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. నువ్వేమిటి బ్రేక్ తీసుకుంటున్నావా అని, కంగారు పడకండి. నేను టివి కోసమే పుట్టాను, ఎంటర్టైన్మెంట్ కోసమే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్లడం లేదు, రిలాక్స్ అవ్వండి అంటూ సుమ కనకాల బుల్లితెరకి బ్రేక్ అనే వార్తలకి కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది.