యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుల లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంటాడు. ఈటీవీలో ఢీ డాన్స్ ప్రోగ్రామ్ లో అలాగే జీ ఛానల్, స్టార్ మా ఇలా ప్రతి ఛానల్ లో మేల్ యాంకర్స్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ప్రదీప్ మాచి రాజు పెళ్లి విషయంలో ఎప్పుడూ సంచలనంగానే నిలుస్తాడు. అప్పుడెప్పుడో సుమ కనకాలతో కలిసి ప్రదీప్ పెళ్లి చూపులు అంటూ షో చేసాడు. అదయ్యి కూడా ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ప్రదీప్ పెళ్లి మేటర్ మాత్రం తెగలేదు.
రీసెంట్ గా ప్రదీప్ మాచిరాజు ప్రముఖ డిజైనర్ తో పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ.. త్వరలోనే నిశ్చితార్ధం, పెళ్లి అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఈ న్యూస్ హల్ చల్ చేసినా ప్రదీప్ స్పందించకపోయేసరికి అందరూ ప్రదీప్ కి పెళ్లి కుదిరిపోయింది అనుకుంటున్నారు. తాజాగా ప్రదీప్ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్ క్లారిటీతో ఫుల్ స్టాప్ పెట్టాడు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించడానికి తాను బిజీగా ఉండడం వలన లేట్ అయ్యింది అని, తనకి నిశ్చితార్ధం, పెళ్లి జరగలేదు, ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పాడు.
తాను, తన ఫ్యామిలీ తన తండ్రి మరణం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు, తనకి ఓ డిజైనర్ తో పెళ్లి జరగబోతుంది అంటున్నారు. అసలు ఆ అమ్మాయెవరో కూడా తనకి తెలియదని, ప్రస్తుతం తన ఫోకస్ టీవీ షోస్ అలాగే సినిమాలపైనే, తాను హీరోగా సినిమా మొదలయ్యింది, అది వచ్చే ఏడాది రిలీజ్ అవ్వొచ్చని ప్రదీప్ మాచిరాజు తన పెళ్లిపై జరుగుతన్న ప్రచారానికి అడ్డుకట్ట వేసాడు.