హీరో సిద్దార్థ్ ఈ మధ్యన అదితి రావు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. అదితి రావుతో డేటింగ్ చేస్తున్న సిద్దార్థ్ ఆ విషయాన్ని మాత్రం ఒప్పుకోడు. కానీ వీరిద్దరూ ముంబైలో చాలాసార్లు కెమెరాలకు కూడా చిక్కారు. బాలయ్య ఆహా అన్ స్టాపబుల్ టాక్ షోలో సిద్దార్థ్ లవ్ మేటర్ ని రివీల్ కూడా చేసారు. అయితే ఈమధ్యన కాంట్రవర్సీలకి కేరాఫ్ గా మారిన సిద్దార్థ్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నాడు. తాజాగా సిద్దార్థ్ పేరెంట్స్ కి మధురై ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురు కావడంపై సిద్దార్థ్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు.
మధురై ఎయిర్‌పోర్ట్ అధికారులు తన తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశారని, దాదాపు ఇరవై నిమిషాలు పాటు వేధించి.. బ్యాగులోని కొన్ని నాణెలను తీయమని ఒత్తిడి చేసారు. అంతే కాకుండా తాము ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం హిందీలో మాట్లాడుతున్నారని, ఈ విషయంపై వారిని గట్టిగా నిలిదీస్తే ఇండియాలో ఇలాగే ఉంటుందని భద్రతా అధికారులు చెప్పారని సిద్దార్థ్ ఎయిర్ పోర్ట్ అధికారులపై ఫైర్ అవుతున్నాడు.