నిన్న హైదరాబాద్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సంక్రాంతికి నువ్వా-నేనా అని పోటీ పడుతున్న బాలకృష్ణ-చిరంజీవిలు హైదరాబాద్ లో చేసిన హడావిడికి ఫాన్స్ రెచ్చిపోతున్నారు. అదేమిటంటే నిన్న మంగళవారం ఉదయం నందమూరి బాలకృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆహా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ కి వెళ్లారు. ఆ ఎపిసోడ్ షూట్ కి ముందు పవన్ కళ్యాణ్ ఫాన్స్, బాలయ్య ఫాన్స్ చేసిన రచ్చ సాయంత్రం వరకు అదే టాపిక్ మీడియాలో నడిచింది. జై పవన్, జై బాలయ్య నినాదాలతో అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టుపక్కల మార్మోగిపోయింది. వీరసింహ రెడ్డిగా బాలయ్య సంక్రాంతికి దుమ్మురేపడానికి రెడీ అయ్యారు.
మెగా స్టార్ చిరు వాల్తేర్ వీరయ్యతో అదే సంక్రాంతికి రాబోతుండడంతో బాలయ్య-చిరు ల మధ్యన ఫైట్ కి రంగం సిద్ధం అయ్యింది. అయితే బాలయ్య ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో హడావిడి చేస్తే.. సాయంత్రం మెగాస్టార్ చిరు రవితేజ తో కలిసి వాల్తేర్ వీరయ్య మీడియా మీట్ నిర్వహించారు. మీడియా మిత్రులకి ప్రశ్నలు-సమాధానాలు అని చెప్పి సిటీకి దూరంగా ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీకి తీసుకు వెళ్లారు. అక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో వాల్తేర్ వీరయ్య కోసం వేసిన పోర్ట్ సెట్ అందరిని ఆకట్టుకుంది. అలాగే చిరు, రవితేజ కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది.
అలా బాలయ్య వీరసింహారెడ్డిగా ఉదయం హైదరాబాద్ నడిబొడ్డున సందడి చేస్తే.. సాయంత్రానికి మెగాస్టార్ చిరు వాల్తేర్ వీరయ్యగా హైదరాబాద్ ఔట్స్ కట్స్ లో హంగామా చేశారన్నమాట.