Advertisementt

పవన్ కే ఇలా ఉంటే.. చిరు వస్తే

Tue 27th Dec 2022 10:11 PM
unstoppable 2,balakrishna,pawan kalyan  పవన్ కే ఇలా ఉంటే.. చిరు వస్తే
Megastar with NBK Unstoppable 2 పవన్ కే ఇలా ఉంటే.. చిరు వస్తే
Advertisement
Ads by CJ

బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం ఫాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్, NBK ఫాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతాకాదు. NBK విత్ PSPK అంటూ ఫ్లెక్సీలు, నినాదాలతో అన్నపూర్ణ స్టూడియోస్ దద్దరిల్లింది. జై బాలయ్య, జై జై బాలయ్య, జై పవన్, సీఎం పవన్ నినాదాలు ఆకాశాన్ని తాకాయి. పవన్ కళ్యాణ్ ఫాన్స్ అక్కడ జాతరని తలపించారు. పవన్ కళ్యాణ్ కే ఇలా ఉంటే.. బాలయ్య షోకి చిరంజీవి వస్తే పరిస్థితి ఏమిటి..

మెగా ఫాన్స్ చేసే రచ్చ చూడగలమా? వినగలమా? నందమూరి-మెగా ఫాన్స్ కలిసి అక్కడ ఎలాంటి విధ్వంసాలు సృష్టిస్తారో కానీ.. చిరంజీవి ఈ సీజన్ కి రాకపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. సీజన్ 2 లో పొలిటికల్, అలాగే కుర్ర హీరోలతో లాగించేసి చివరికి ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ తో ఒక్కసారిగా ఆహా అన్ స్టాపబుల్ షోపై క్రేజ్ ని కలిగించారు, హైప్ ని తీసుకొచ్చారు. కేవలం ఎపిసోడ్ షూట్ కే ఇంత హంగామా ఉంటే.. రేపు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ రోజున ఆహా యూజర్స్ చేసే హడావిడికి టీవీలు అన్ని ఆగిపోతాయేమో అన్న రేంజ్ లో ఉంది హడావిడి.

మరి మెగాస్టార్ బాలయ్య షోకి వస్తే ఇంత హడావిడి ఉంటుందా.. గతంలో ఆయన సమంత టాక్ షోలో పాల్గొన్నారు. కానీ బాలయ్య-చిరు కలిస్తే ఫైర్ పుట్టాల్సిందే. సంక్రాంతికి థియేటర్స్ దగ్గర పోటీ పడే వీరి కలయికలో ఆహా అన్ స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ వస్తే మాములుగా ఉండదు. మరి చిరు ఎపిసోడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తారో చూడాలి.

Megastar with NBK Unstoppable 2:

Unstoppable 2: Balakrishna -Pawan Kalyan episode shot underway

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ