Advertisementt

వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్

Tue 27th Dec 2022 07:32 PM
keerthy suresh,mahanati  వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్
Keerthy Suresh shares beach pics వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

మహానటి మహానటి అని బోర్ కొట్టేదాకా కీర్తి సురేష్ ని పిలిచి పిలిచి ప్రేక్షకులకి బోర్ కొట్టేసింది. అందులోనూ మహానటి బరువుని తగ్గించుకుని నాజూగ్గా తయారైన కీర్తి సురేష్ లుక్ పరంగా చాలా విమర్శలు ఎదుర్కొంది. బరువైతే తగ్గింది కానీ.. మునుపుటి గ్లో మాత్రం పోగొట్టుకుంది. మొహం కాంతివంతంగా ఉండాల్సింది పోయి.. నీరసంగా తయారైంది. అయినప్పటికీ యోగాసనాలతో బరువు తగ్గిస్తూనే ఉంది.

బరువు తగ్గాక 2022 నుండి కీర్తి సురేష్ గ్లామర్ డాల్ గా మారిపోయింది. మహానటిగా పద్దతిగా ఉండే కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ గర్ల్ గా అందాలు చూపించేస్తుంది. తెలుగులో నాని దసరాలో నటిస్తున్న  కీర్తి సురేష్ చిరు భోళా శంకర్ లో ఆయనకి సిస్టర్ కేరెక్టర్ లో కనిపించబోతుంది. అలాగే తమిళ, మలయాళ ఫిలిమ్స్ తో బిజీ గా గడుపుతున్న కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఈ మధ్యన సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నా అమ్మడు మాత్రం సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తుంది.

తాజాగా Do you see what I seaa! 🏞️ Paradise #KohSamui🌴 #TravelDiaries అంటూ బీచ్ ఒడ్డున ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ చేతిలో గ్లాస్ తో కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని సేద తీరుతున్న పిక్ ని షేర్ చేసింది. సముద్రపు ఒడ్డున కాటేజ్ లో కీర్తి సురేష్ అలా రిలాక్స్ అవడం చూసి అభిమానులు.. ఆనందపడుతున్నారు.

Keerthy Suresh shares beach pics:

Keerthy Suresh looks oh so beautiful as she enjoys beach

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ