Advertisementt

NBK అన్ స్టాపబుల్ షోలో PSPK లుక్

Tue 27th Dec 2022 02:06 PM
pawan kalyan. nbk show  NBK అన్ స్టాపబుల్ షోలో PSPK లుక్
Pawan Kalyan look at NBK Unstoppable show NBK అన్ స్టాపబుల్ షోలో PSPK లుక్
Advertisement
Ads by CJ

బాలకృష్ణ ఆహా టాక్ షో అన్ స్టాపబుల్ కి టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవడంతో ఈ ఎపిసోడ్ పై ఫాన్స్ లో భీబత్సమైన క్యూరియాసిటీ మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాలయ్యతో పవన్ ఎపిసోడ్ కోసం తెగ వెయిట్ చేసేలా అరవింద్ ప్లాన్ చేసారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు బాలయ్య షోకి వస్తున్నారని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ లో అభిమానులతో పెద్ద హంగామా ఏర్పాటు చేసారు అరవింద్. నందమూరి-మెగా అభిమానులు కలిసి అక్కడ చేసిన రచ్చ ఛానల్స్ లో చూసిన వారికి గూస్ బంప్స్ వచ్చాయి. బాలయ్య TDP పార్టీలో ఉంటే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు. అలాగే టాలీవుడ్ లోను పోటీ పడుతున్న హీరోలు.. కావడంతో ఈ క్రేజీ ఎపిసోడ్ పై అంచనాలు అంతకంతా పెరిగిపోతున్నాయి. ఈరోజు షూట్ కి పవన్ కళ్యాణ్ రాగానే బాలయ్య రిసీవ్ చేసుకున్న విధానం, ఆలింగనం చేసుకుని లోపలి తీసుకువెళ్లడం అని అద్భుతమే అన్నట్టు చూసారు అభిమానులు.

లోపల పవన్ ఎలా ఉంటారో.. ఓ టాక్ షోలో, అందులోను బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో అనే ఉత్సుకత పెరిగిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ స్టేజ్ పై వినమ్రంగా చేతులు కట్టుకుని బాలయ్య ముందు సోఫాలో కూర్చున్నారు. బాలయ్య భుజం మీద చెయ్యి వెయ్యగా అక్కడ అభిమానులకి పవన్ కళ్యాణ్ అభివాదం చేసిన పిక్స్ లీకై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ బ్లాక్ అవుట్ ఫిట్స్ లో అదిరిపోయారు.

ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఎదురు చూపులు అప్పుడే మొదలు పెట్టేసారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ షూట్ జరుగుతుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్, డైరెక్టర్ త్రివిక్రమ్ జాయిన్ అవ్వొచ్చు అని తెలుస్తుంది.

Pawan Kalyan look at NBK Unstoppable show:

Pawan Kalyan in NBK show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ