Advertisementt

పిక్ టాక్: మెగా లవ్

Tue 27th Dec 2022 01:12 PM
upasana,ram charan  పిక్ టాక్: మెగా లవ్
Pic Talk: Mega Love పిక్ టాక్: మెగా లవ్
Advertisement
Ads by CJ

మెగా హీరో రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టేటస్ అందుకున్నాడు. ఇప్పుడు శంకర్ తో RC 15 చేస్తున్నాడు. ప్రస్తుతం RC 15 షూటింగ్ రాజమండ్రి దగ్గర బ్రిడ్జ్ కింద గోదావరి మధ్యలో ఇసుకుతెన్నెల్లో సెట్ వేసి అక్కడ ఎలక్షన్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ షెడ్యూల్ ముగిసాక రామ్ చరణ్ కర్నూల్ బయలుదేరుతాడు. అక్కడ కొండారెడ్డి బురుజు దగ్గర మరో షెడ్యూల్ శంకర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు.. రామ్ చరణ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. మెగా ఫ్యామిలిలో సంతోషం మొదలైపోయింది. ఉపాసన మెగా ఫ్యామిలీకి వారసుడిని ఇవ్వబోతుంది.

ప్రెగ్నెంట్ అయ్యాక ఉపాసన తన పుట్టింటికి వెళ్లి అక్కడ అత్తమ్మ సురేఖని మిస్ అవుతున్నట్టుగా ట్వీట్ చేసింది. తర్వాత మెగా ఫ్యామిలిలో క్రిష్ట్మస్ సెలబ్రేషన్ లో రామ్ చరణ్ తో కలిసి కనబడింది. ప్రస్తుతం ఉపాసన ఎక్కడ కనిపించినా ఆమె బేబీ బంప్ కోసం జనాలు వెతికేస్తున్నారు. ఇక నేడు ఉపాసన తన భర్త చరణ్ తో కలిసి ఉన్న లవ్లీ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రామ్ చరణ్ అలాగే తమ్ పెట్ రైమా తో ఉపాసన సంతోషంగా ఉన్న పిక్ తో పాటుగా.. Grateful for all the love ❤️ అని క్యాప్షన్ పెట్టింది.

తల్లితండ్రులవుతున్న రామ్ చరణ్-ఉపాసన అలా కలిసి అందంగా కనిపిస్తే మెగా ఫాన్స్ ఊరుకోరు కదా.. పట్టరాని ఆనందంతో పండగ చేసుకుంటూ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Pic Talk: Mega Love:

Upasana Shares Precious Pictures With Hubby Ram Charan

Tags:   UPASANA, RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ