హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్, నందమూరి అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో ఉంది. జై పవన్, జై బాలయ్య స్లొగన్స్, అక్కడ భారీ ఫ్లెక్సీలు పట్టుకుని అభిమానులు గందరగోళం చేస్తున్నారు. NBK అన్ స్టాపబుల్ సీజన్ 2 కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా బాలయ్య టాక్ షోకి రావడం అంటే ఈ మాత్రం హడావిడి, సందడి ఉండాల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ ప్రోగ్రాం జరిగే దగ్గర అభిమానుల హడావిడి, కోలాహలం మధ్యన బాలకృష్ణ కారులో నుండి దిగి అభిమానులకి అభివాదం చేసారు.
అల్లు అరవింద్ అక్కడ మీడియా మీట్ నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాలన్నీ ఇసుక వేస్తె రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. PSPK with NBK అంటూ ఫ్లెక్సీల తో పవన్ కళ్యాణ్ కి, బాలకృష్ణ కి గ్రాండ్ గా స్వాగతం పలికారు అభిమానులు. పవన్ కి రాజకీయంగా, సినిమాల పరంగా విపరీతమైన అభిమాన గణం ఉంది. ఇక బాలయ్యకి నందమూరి ఫాన్స్ గణం ఉంది. ఇప్పుడు ఇద్దరి ఫాన్స్ ఫుల్ జోష్ లో కేరింతలు పెడుతున్నారు. అభిమానుల కోలాహలం మధ్యన బాలయ్య-పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ కాసేపట్లో మొదలు కాబోతుంది.
మరి ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ ని ఎలా ఇరికిస్తారు. ఎలాంటి ప్రశ్నలతో ఉడికిస్తారు, ఉక్కిరిబిక్కిరి చేస్తారో.. పవన్ చెప్పే సమాధానాలు ఏమిటి, పవన్ రాజకీయ, వ్యక్తిగత, సినిమా విషయాలని ఈ టాక్ షోలో రివీల్ అయ్యే ఛాన్స్ ఉండడంతో నందమూరి, పవన్ ఫాన్స్ మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, ప్రజలు చాలా ఉత్సుకతతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ ఆహా లో సంక్రాంతి స్పెషల్ గా స్ట్రీమింగ్ కి రాబోతుంది.