ఇప్పుడు ఆ హీరోయిన్ కి మరో డిసాస్టర్ అయినా పర్లేదు.. అవకాశాలు మాత్రం వెల్లువలా వచ్చిపడతాయని ఆడియన్స్ అయితే డిసైడ్ అయ్యిపోయారు. ఆమె శ్రీలీల. పెళ్లి సందడి టాక్ చూస్తే ఆమెకి అవకాశాలే రావు. కానీ శ్రీలీల కి అవకాశాలే అవకాశాలు. గతంలో కృతి శెట్టి కి ఉప్పెన రిలీజ్ అవ్వకుండా నాని, రామ్, సుధీర్ బాబు, నితిన్ లు అవకాశాలు ఇచ్చినట్టుగా.. ఇప్పుడు శ్రీలీల కి కూడా అలానే ధమాకా రిలీజ్ అవ్వకముందే రామ్, నితిన్, వరుణ్ తేజ్, బాలయ్య మూవీస్ లో ఛాన్స్ లు వచ్చి పడ్డాయి.
ధమాకాకి ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే కేవలం శ్రీలీల వల్లే. ఆమె డాన్స్, గ్లామర్ అన్ని ధమాకాని నిలబెట్టేశాయి. లేదంటే ధమాకాకి వచ్చిన టాక్ చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం అటుంచి అసలు బయ్యర్లు ఎంత నష్టపోతారో అనుకున్నారు. కానీ ధమాకా గట్టెక్కేసింది. ఒకవేళ బ్రేక్ ఈవెన్ కొట్టకపోయినా.. పెద్దగా నష్టాలైతే ఉండవు. ఎంతోకొంత సేఫ్ అయితే అవుతారు. అందుకే అనేది పెళ్లి సందడి డిసాస్టర్ అయినా ధమాకా ఛాన్స్ వచ్చింది.
ఒకవేళ ధమాకా పోయినా.. పాపకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆమె గ్లామర్ తో సినిమాని నిలబెట్టేస్తుంది. ఇకపై స్టార్ హీరోల ఛాన్స్ లు వచ్చినా శ్రీలీల కి ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇకపై ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ వీరంతా శ్రీలీలపై ఫోకస్ పెడితే బావుంటుంది.