అఖిల్ ఏజెంట్ సంక్రాంతికి రిలీజ్ అని మేకర్స్ ఓ పోస్టర్ వేసి వదిలేసారు. సంక్రాంతి వచ్చేసింది. ప్రమోషన్స్ సందడి అటుంచి సినిమా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. ఏకే ఎంటర్టైన్మెంట్స్-సురేందర్ రెడ్డి లు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటూ అక్కినేని ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అఫీషియల్ గా ఏజెంట్ సంక్రాంతికి రావడం లేదనేది తేలిపోయింది. పాన్ ఇండియా మూవీ గా ఐదు భాషల్లో ఏజెంట్ ని రిలీజ్ చేస్తున్నారు. అఖిల్ కూడా అదే లెవల్లో ఏజెంట్ లుక్ లో కొనసాగుతున్నాడు.
షూటింగ్ అప్ డేట్ ఉండదు, కనీసం ప్రమోషన్స్ లేవు. అదలాఉంటే ప్రస్తుతం ఏజెంట్ యాక్షన్ సీన్స్ కొన్ని చిత్రీకరిస్తున్నారట. అలాగే ఈ షెడ్యూల్ లోనే అఖిల్-హీరోయిన్ సాక్షి పై రెండు సాంగ్స్ తో పాటుగా, ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరిస్తారని తెలుస్తుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సోల్జర్ గా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఏజెంట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో భారీ ట్విస్ట్ ఉంటుంది అని, అఖిల్ క్యారెక్టర్ పై రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలెట్ అవుతుంది అంటున్నారు. తాజాగా అఖిల్ ఏజెంట్ ని ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ చూస్తున్నారట.
అదే విషయాన్ని న్యూ ఇయర్ రోజున గ్రాండ్ గా పోస్టర్ వేసి ప్రకటిస్తారని తెలుస్తుంది. అంటే న్యూ ఇయర్ కి అఖిల్ ఏజెంట్ నుండి రిలీజ్ డేట్ అప్డేట్ పోస్టర్ రాబోతుంది. ఈ సినిమా అప్ డేట్ కోసం అక్కినేని ఫాన్స్ వెయిటింగ్.