ఈ ఏడాది బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు బాగా మోగిపోయిన పేరు హాట్ బ్యూటీ అలియా భట్ ది. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ లో సీత గా ప్రమోషన్స్ తో ఇండియా వైడ్ చుట్టేసింది. అదే పెద్ద సెన్సేషన్ అయితే.. ఈ ఏడాది ఈ క్యూటీ పెళ్లి చేసుకుని విపరీతంగా ట్రెండ్ అయ్యింది. రణబీర్ కపూర్ తో ఏడడుగులు నడిచింది. వెంటనే ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ హాట్ టాపిక్ గా నిలిచింది. అదే ప్రెగ్నెన్సీయ్ తో బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆరు నెలల్లోనే అలియా భట్ పండంటి కూతురుకి జన్మనిచ్చింది. ఇలా ట్రిపుల్ ఆర్, బ్రహ్మాస్త్ర మూవీస్ తో క్రేజీ గా మారిన హీరోయిన్ అలియా అటు పర్సనల్ లైఫ్ లోను 2022 యేడాదిని తీపి గుర్తుగా మిగిల్చుకుంది.
అయితే బిడ్డ పుట్టి నెలన్నర తిరక్కుండానే అలియా భట్ ప్రెగ్నెన్సీ బరువుని కరిస్తుంది. హెవీ ఎక్సర్ సైజెస్ చెయ్యకుండా అనుష్క యోగాని ఆశ్రయించింది. అనుష్క యోగ కి వెళ్లి గురువుగారు చెప్పినట్టుగా యోగాసనాలు వేస్తున్నా అని చెబుతుంది అలియా భట్. డెలివరీ తర్వాత ఒకటిన్నర నెల తర్వాత నా బాడీపై దృష్టి పెట్టాను. మనం బాడీ మీద శ్రద్ద పెట్టాలి, తగిన శ్రద్ద తీసుకోవాలి, నేను డెలివరీ అయ్యాక వాకింగ్, ప్రాణాయామం మాత్రమే చేశాను. బిడ్డకి జన్మనివ్వడం అనేది చాలా అద్భుతం. ఇప్పుడు నేను నా ట్రైనర్ ఆధ్వర్యంలో ఇలా ఆసనాలు వేస్తున్నాను, ఇంకా చెయ్యాల్సింది ఉంది.
మనం మన శరీరం ప్రేమించడం అంటే మనం మన శరీరానికి ఇచ్చే గౌరవం. అందరి శరీరం ఒకేలా ఉండదు. ఏ ఆసనాలు వెయ్యాలో డాక్టర్స్ సలహాలు తీసుకోండి అంటూ అనుష్క యోగాలో తల్లకిందులుగా వేలాడుతున్న అలియా భట్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.