యశ్ కెజిఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు, రికార్డులు సృష్టించాడు. కెజిఎఫ్ తర్వాత యశ్ కొత్త సినిమాపై గత ఆరు నెలలుగా సందిగ్దత నెలకొంది. యశ్ కెజిఎఫ్ తర్వాత చెయ్యబోయే కొత్త చిత్రం ఎలా ఉండబోతుంది, ఏ దర్శకుడితో యశ్ కొత్త ప్రాజెక్ట్ సెట్స్ మీదకి తీసుకువెళతాడు అనే క్యూరియాసిటీ అంతకంతకు పెరుగుతుంది కానీ యశ్ కొత్త ప్రాజెక్ట్ విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. అసలు కెజిఎఫ్ సీరీస్ లో కెజిఎఫ్ 3 తో సెట్స్ మీదకి వెళతాడా లేదంటే కొత్త జానర్ లో ట్రై చేస్తాడా అని ఫాన్స్ కూడా తెగ ఎదురు చూస్తున్నారు.
కానీ యశ్ మాత్రం ఓ బ్లాక్ బస్టర్ తర్వాత ఏది పడితే అది చేయలేము, నా తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు మరికాస్త వెయిట్ చెయ్యాలి. మనం సక్సెస్ సాధించినప్పుడు దాని గురించి ప్రేక్షకులు మాట్లాడాలి కానీ, మన డబ్బు మనం కొట్టుకోకూడదు. ఒక రాజు ప్రజలవద్దకు వెళ్లి నేనే రాజుని అని చెప్పుకుంటే బాగోదు కదా.. నా తదుపరి ప్రాజెక్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కెజిఎఫ్ సీరీస్ తో వచ్చిన విజయాన్ని చూసి నేను షాకయ్యను. కానీ నేను సక్సెస్ ని క్యాష్ చేసుకునే రకం కాదు.
ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కష్టపడతాను. కానీ వెనక్కి తగ్గను. ఏ పనైనా ఎంత యాక్టీవ్ గా మొదలు పెడతానో, అంతే ఎనర్జీతో పూర్తి చేస్తాను. వర్క్ విషయంలో ఎంత పోరాటానికైనా సిద్దమే అంటూ యశ్ కొత్త ప్రాజెక్ట్ ఇంకాస్త లేట్ అవుతుంది అంటూ తెల్చేయ్యడంతో ఆయన అభిమానులు డిస్పాయింట్ అవుతున్నారు.