Advertisementt

చలపతిరావు మరణం తీరని లోటు: చిరు

Sun 25th Dec 2022 11:34 AM
chiranjeevi,chalapathi rao  చలపతిరావు మరణం తీరని లోటు: చిరు
Chiranjeevi mourn for Chalapathi Rao చలపతిరావు మరణం తీరని లోటు: చిరు
Advertisement
Ads by CJ

సీనియర్ నటులు చలపతిరావు నిన్న శనివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్‌లో తన కుమారుడు రవిబాబు ఇంట్లో ఉంటున్నారు. చలపతిరావు కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఈ బుధవారం నిర్వహించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కాయాన్ని.. కుమారుడు రవిబాబు ఇంట్లోనే అభిమానుల సందర్శనార్థం ఉంచి.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానం ఫ్రీజర్‌లో ఉంచడం జరుగుతుందని చలపతిరావు తనయుడు రవిబాబు తెలిపారు. చలపతిరావు మరణ వార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.

పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చలపతిరావు మృతికి సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలో..

విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.. అంటూ ట్వీట్ చేసారు.

Chiranjeevi mourn for Chalapathi Rao:

Veteran Tollywood actor Chalapathi Rao passed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ