Advertisementt

చలపతిరావు మృతికి బాలయ్య, తారక్ సంతాపం

Sun 25th Dec 2022 10:48 AM
balakrishna,jr ntr,chalapathi rao  చలపతిరావు మృతికి బాలయ్య, తారక్ సంతాపం
Balayya and Tarak mourn the death of Chalapathi Rao చలపతిరావు మృతికి బాలయ్య, తారక్ సంతాపం
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితం సీనియర్ నటులు కైకాల సత్యన్నారాయణ మృతి తో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆ బాధనుండి తేరుకునేలోపే సీనియర్ నటులు చలపతి రావు గుండెపోటుతో మృతి చెందడం మరింత బాధాకర విషయం. చలపతిరావు గారి మరణ వార్త విని అందరూ షాకవుతునాన్రు. ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ వార్త విని ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. అపలువురు ప్రముఖులు చలపతిరావు గారి పార్థీవ దేహానికి నివాళుల అర్పిస్తున్నారు. బాల్కకృష్ణ, తారక్ సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేసారు.

నందమూరి బాలకృష్ణ:

సౌమ్యులు, వివాదరహితులు, సీనియర్ నటులు చలపతిరావు గారి హఠాన్మరణం బాధాకరం. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నటులను చిత్రపరిశ్రమ కోల్పోయింది. నటుడిగా, ప్రతినాయకుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అందరి ఆదరాభిమానాలు పొందారు. ఆయన పౌరాణిక, సాంఘిక పాత్రల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. స్వర్గీయ ఎన్ టీరామారావు నటించిన దానవీరశూరకర్ణ చిత్రంలో చలపతిరావుగారి పాత్ర నేటికి కళ్లకుకట్టినట్లుగా ఉంటుంది. 1200కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే

తారక్:

చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన.

Balayya and Tarak mourn the death of Chalapathi Rao:

Balakrishna and Jr NTR mourn the death of Chalapathi Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ