Advertisementt

మంచు ఫ్యామిలీ కలతలు: మంచు లక్షి రియాక్షన్

Sat 24th Dec 2022 07:11 PM
manchu lakshmi,manchu family issues  మంచు ఫ్యామిలీ కలతలు: మంచు లక్షి రియాక్షన్
Manchu Family Troubles: Manchu Lakshmi Reaction మంచు ఫ్యామిలీ కలతలు: మంచు లక్షి రియాక్షన్
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలిలో ఏదో జరుగుతుంది. కానీ ఎవ్వరికి క్లారిటీ రావడం లేదు. మంచు మనోజ్ ఫ్యామిలీతో కలిసి ఉండడం లేదు. ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. కారణం మనోజ్ సెకండ్ మ్యారేజ్ పై నిర్ణయమే అని తెలుస్తుంది. మా మధ్యన గొడవలేం లేవు.. మేము సఖ్యతగానే ఉన్నామని వాళ్ళు చెప్పినా మీడియా నమ్మే పరిస్థితిలో లేదు. మోహన్ బాబు-మంచు విష్ణు కలిసే ఉంటారు. మంచు లక్ష్మి ఫిలిం నగర్ ఇంట్లో ఉంటుంది. తరచూ తండ్రి దగ్గరికి వెళుతుంది. కానీ మనోజ్ ఈ మధ్యన ఫ్యామిలీ మెంబెర్స్ ని కలిసిన సందర్భం లేదు.

ఇలా మీడియాలో మంచు ఫ్యామిలి కలతలు విషయం ఎప్పటినుండో ప్రచారంలో ఉండగా.. తాజాగా మంచు లక్ష్మి దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు ఫ్యామిలి గొడవలపై ప్రశ్న ఎదురవగా.. పని పాట లేకుండా కూర్చుని కామెంట్ చేసే వాళ్ళని నేను పట్టించుకోను, నేను మాట్లాడే విధానంపై చాలామంది ట్రోల్ చేస్తారు. నేను దాన్ని సీరియస్ గా తీసుకోను. నా ఫ్యామిలీ విషయంలో వినిపించే కామెంట్స్ అన్నీ మా పర్సనల్. వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 

మా ఫ్యామిలిలో ఏం జరుగుతుందో అది మా వ్యక్తిగత విషయం, సమయం వస్తే అందరం కలిసే కనబడతాం. మనోజ్ నేనూ తరచూ కలుస్తాం. కానీ విష్ణు ప్రొఫెషనల్, పిల్లలు, కెరీర్, బిజినెస్ వీటిపై ఎక్కువ ఫోకస్ పెడతాడు. అవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయలేము కదా అంటూ మంచు లక్ష్మి మంచు ఫ్యామిలీ గొడవలపై రియాక్ట్ అయ్యింది. 

Manchu Family Troubles: Manchu Lakshmi Reaction:

Manchu Lakshmi Reacts on Family Issues

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ