Advertisementt

సలార్ అప్డేట్ అదిరిపోలా..

Sat 24th Dec 2022 04:26 PM
prabhas,salaar  సలార్ అప్డేట్ అదిరిపోలా..
Interesting News on Salaar సలార్ అప్డేట్ అదిరిపోలా..
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ - పాన్ ఇండియా డైరెక్టర్ కలయికలో పాన్ ఇండియా మూవీ అంటే ఏ రేంజ్ అంచనాలుంటాయో అంతకు మించి అనేలా ప్రభాస్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సలార్ మూవీపై ఉన్నాయి. కె.జి.ఎఫ్ దర్శకుడు, బాహుబలి హీరో కాంబో అంటే ఫాన్స్ కి పూనకాలు తెప్పించే కాంబినేషన్. ఇలాంటి చిత్రంలో మలయాళ సూపర్ హీరో పృథ్వీ రాజ్ విలన్ గా నటించడం మరిన్ని అంచనాలు క్రియేట్ చేసింది. అయితే ప్రభాస్ సలార్ షూట్ లో పాల్గొంటున్నాడు.. అప్పుడప్పుడు మారుతీ, ప్రాజెక్ట్ K లకి పని చేస్తున్నాడు. కానీ సలార్ షూటింగ్ విషయాలేవీ బయటికి రాకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ కాస్త కంగారులో ఉన్నారు.

తాజాగా సలార్ నిర్మాత విజయ్ విజయ్ కిరగందూర్ సలార్ షూటింగ్ పై అలాగే విడుదల తేదీపై జరుగుతన్న ప్రచారానికి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సలార్ ఎట్టి పరిస్థితుల్లో 2023 సెప్టెంబర్ 28 నే రిలీజ్ అవుతుంది, ప్రస్తుతం సలార్ షూటింగ్ 85 శాతం పూర్తయ్యింది. జ‌న‌వ‌రి నెల చివరి వారానికి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఆరు నెల‌లు వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నులు పూర్తి చేయ‌టానికి స‌మ‌యం ప‌డుతుంది. 

అంతేకాకుండా ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే సెప్టెంబ‌ర్ 28న స‌లార్ సినిమాను విడుద‌ల చేస్తాం అంటూ ఇచ్చిన అప్ డేట్ తో ప్రభాస్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. జూన్ లో ఆదిపురుష్ రిలీజ్ అవుతుంది కనీసం ఆరు నెలల గ్యాప్ లేకుండా సలార్ ని విడుదల చెయ్యరు.. సో వచ్చే ఏడాది డిసెంబర్ కి సలార్ వెళ్లిపోవచ్చు, లేదంటే 2024 అంటూ జరిగే ప్రచారానికి సలార్ నిర్మాత ఇలా క్లారిటీ ఇచ్చారు.

Interesting News on Salaar:

Prabhas Salaar to be wrapped by Jan-end

Tags:   PRABHAS, SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ