మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు కాలం చేసి ఏళ్ళు గడిచినా ప్రతి ఏడాది ఆయన ఆర్థికాన్ని నిర్వహిస్తూ తండ్రిని స్మరించుకుంటూ ఉంటారు. తల్లి, తమ్ముళ్లు, చెల్లెళ్ళతో చిరంజీవి గారు తండ్రి వెంకట్రావు గారి ఫోటోకి పూల మాల వేసి నైవేద్యం పెట్టి ఆయనకి నివాళులర్పిస్తారు. ప్రతి ఏడు లాగే ఈ ఏడాది కూడా మెగాస్టార్ చిరు తండ్రి ఆర్థికాన్ని పూర్తి చేసి భావోద్వేగంతో సోషల్ మీడియాలో తండ్రి ఉన్నప్పుడు ఇంటి సభ్యులతో దిగిన ఫొటోస్ ని షేర్ చేసారు. దానితో పాటుగా..
మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల
అవగాహన పంచి,
మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన
మా తండ్రి వెంకట్రావు గారిని
ఆయన సంవత్సరీకం సందర్బంగా
స్మరించుకుంటూ .. అంటూ చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.