పూజ హెగ్డే కి వరసగా తగిలే షాక్ ల కన్నా ఆమె మీద జరిగే నెగెటివ్ ప్రచారమే పూజ హెగ్డే కి ఎక్కువ ష్టం కలిగించేలా ఉన్న కారణంగా పూజ హెగ్డే ఆ వార్తలకి అడ్డుకట్ట వెయ్యడానికి ట్రై చేస్తుంది. పూజ హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో పట్టుదలకి పోతుంది అని, ఆమె పారితోషకం డిమాండ్ చెయ్యడమే కాకుండా మేకప్ మ్యాన్, ఆమెతో వచ్చే అసిస్టెంట్, మేనేజర్ అంటూ ఓ 15 మంది సిబ్బంది ఖర్చు కూడా నిర్మాతల మీదే వేస్తుంది, ఆ రకంగా నిర్మాతలకి పూజ హెగ్డే పెను భారంగా మారింది అంటూ ప్రచారం ఎప్పటినుండో జోరుగా జరుగుతుంది.
సినిమాలు ప్లాప్ అయినా పారితోషకం విషయంలో పూజ ముక్కు పిండి వసూలు చేస్తుంది అంటూ పూజ హెగ్డే పై నెగెటివ్ ప్రచారం జరగడంతో పూజ ఈ వార్తలకి స్ట్రాంగ్ గానే అడ్డు కట్ట వేసింది. కథ నచ్చినా, నేను అడిగిన పారితోషకం ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ ని నేను రిజెక్ట్ చేస్తున్నట్లుగా రాస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను డబ్బు మాత్రమే ముఖ్యమని అనుకునే టైప్ కాదని, అలా అయితే ఒకటి రెండు సినిమాలకి కనబడకుండా పోయేదాన్ని, ఇంతదాకా వచ్చేదాన్ని కాదు అంటూ చెప్పింది.
ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో వచ్చిన ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాలి, అదే తెలివైన పని, కాదు నాకు పారితోషకం గట్టిగా ఇవ్వాల్సిందే అంటే.. నేను కాకపోతే మరొకరు దొరుకుతారు. అంతేకాని సినిమా అయితే ఆగదు కదా.. మంచి చిత్రాలను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలి కానీ, డబ్బే ముఖ్యమని కూర్చోకూడదు అంటూ తనపై వస్తున్న దుష్ప్రచారానికి ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది పూజ హెగ్డే.