Advertisementt

జబర్దస్త్ లోకి వచ్చింది పాపులర్ అయ్యింది

Fri 23rd Dec 2022 10:07 PM
jabardasth,anchor sowmya rao  జబర్దస్త్ లోకి వచ్చింది పాపులర్ అయ్యింది
Soumya came into Jabardasth and became popular జబర్దస్త్ లోకి వచ్చింది పాపులర్ అయ్యింది
Advertisement
Ads by CJ

చాలామంది అనామకులు జబర్దస్త్ నుండి పాపులర్ అయ్యి ప్రస్తుతం వెండితెర మీద, బుల్లితెర మీద క్రేజ్ తెచ్చుకున్నారు. జబర్దస్త్ లోకి వచ్చిన వారంతా ఎవ్వరికి తెలియని ముఖాలే. కానీ ఇప్పుడు వారే బుల్లితెర మీద రాజ్యమేలుతున్నారు. ఇప్పటివరకు తమిళ, తెలుగు సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు ఇప్పుడు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి గ్లామర్ షో చెయ్యగానే వచ్చేసింది. రీసెంట్ గా అనసూయ నుండి రష్మీకి, రష్మీ ప్లేస్ లోకి కొత్తగా వచ్చిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య గురించే ఇదంతా.

ఆమె తెలుగు, తమిళ సీరియల్స్ లో నటించింది. అది కూడా విలన్ రోల్స్ తో పాపులర్ అయ్యింది.. కానీ జబర్దస్త్ స్టేజ్ పైకి వచ్చాక ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం సౌమ్య బ్యాగ్ రౌండ్, సౌమ్య పాత ఫోటో షూట్స్, ఆమె ఏయే సీరియల్స్ లో నటిస్తుంది అని గూగుల్ లో నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు. అటు సౌమ్య కూడా జబర్దస్త్ స్టేజ్ పై అనర్గళంగా తెలుగు మాట్లాడేస్తూ జెడ్జెస్ ని ఆశ్చర్య పరుస్తుంది. 

అంతేకాకుండా సౌమ్య ఫోటో షూట్స్ తో గ్లామర్ రచ్చ మొదలు పెట్టింది. ఇక కమెడియన్స్ కూడా సౌమ్య మీద పంచెస్ వేస్తూ ఆమెని అట పట్టించినా సరదాగా నవ్వేస్తుంది. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా సౌమ్య చాలా త్వరగా ఫెమస్ అయ్యింది అనే చెప్పాలి.

Soumya came into Jabardasth and became popular:

Jabardasth New Anchor Sowmya Rao

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ