ఆడాళ్లకు మీకు జోహార్లు అంటూ డిసాస్టర్ మూవీని చవి చూసిన శర్వానంద్ ఈ ఏడాది టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితంతో అద్భుతమైన హిట్ కొట్టాడు. ఒకే ఒక జీవితం తర్వాత రీసెంట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోకి హాజరై హడావిడి చేసిన శర్వానంద్ తదుపరి మూవీపై ఆయన అభిమానుల్లో ఆత్రుత మొదలైంది. మాస్ మూవీతో వస్తాడా? ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తాడా? ఏ దర్శకుడితో సెట్స్ మీదకి వెళతాడో అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కనబడుతుంది.
అయితే తాజాగా శర్వానంద్ భలేమంచి రోజు, దేవదాస్, శమంతకమణి ఫేమ్ శ్రీ రామ్ ఆదిత్య తో కొత్త చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ చిత్రంలో శర్వానంద్ కృతి శెట్టి తో రొమాన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న నాగ చైతన్య కష్టడి సినిమాతో పాటుగా రీసెంట్ గా మలయాళం మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ క్యూట్ భామ మొదటిసారి శర్వా తో జోడి కడుతుంది.
శ్రీరామ్ ఆదిత్యా డైరెక్టర్ గా శర్వానంద్-కృతి శెట్టి కలయికలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ కొత్త చిత్రం కొత్త ఏడాది మొదట్లో ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది.