ఇప్పుడు టాలీవుడ్ లో కొన్ని వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అవే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడమే షాకింగ్ అనుకుంటే.. అదే షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతుండడం మరింత సెన్సేషన్. బాలకృష్ణ తో మెగా హీరో వినడానికే ఆతృతగా ఉన్న న్యూస్. అసలే సంక్రాంతి సమయంలో అన్నగారు చిరు వాల్తేర్ వీరయ్యతో బాలయ్య వీరసింహారెడ్డి తలపడుతున్న వేళ పవన్ కళ్యాణ్-బాలయ్య కలయిక వింత కాక మరేమిటి.
అదంతా అలాఉంటే.. బాలకృష్ణ వీర సింహ రెడ్డి సెట్స్ లో పవన్ కళ్యాణ్ కనిపించడం మరింత ఆసక్తిని కలిగిస్తున్న న్యూస్. పవన్ కళ్యాణ్ వీరసింహ రెడ్డి సెట్స్ కి వెళ్లి బాలకృష్ణ ని మీటవడం ఓ లీకెడ్ పిక్ ద్వారా వీక్షించిన జనాలు రకరకాలుగా ఊహించుకుంటుంటే.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది హాట్ హాట్ గా చర్చకు దారితీసింది. వీరసింహ రెడ్డి సెట్స్ లో ఉస్తాద్ పవర్ స్టార్ అంటూ అటు నందమూరి ఫాన్స్, ఇటు పవన్ ఫాన్స్ గొంతు చించుకుని అరుస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్, వీరసింహ రెడ్డి మేకర్స్ ఒక్కరే కావడం ఇంకాస్త ఆసక్తిని కలిగించే విషయం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వాల్తేర్ వీరయ్య సెట్స్ లో చిరుని కలిసినట్టుగా.. వీరసింహారెడ్డి సెట్స్ లో బాలయ్యని కలవడంతో హీట్ పెరిగింది. అన్నగారితో కాంపిటీషన్ కి వస్తున్న బాలయ్యని పవన్ కలవడమంటే మాములు విషయం కాదు, అందుకే ఆ లీకెడ్ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
కాని కొంతమంది పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి బాలయ్యని మీటవ్వడం వెనుక కారణాలను వెతికేస్తున్నారు. అయితే ఆ లీకెడ్ పిక్ వైరల్ అవడం చూసిన మేకర్స్ వీరమల్లు వీరసింహ రెడ్డి సెట్స్ లో అంటూ బాలయ్య-పవన్ ఉన్న పిక్ ని అధికారికంగా వదిలారు.