అలనాటి విలన్, కేరెక్టర్ ఆర్టిస్ట్ కైకాల సత్యన్నారాయణ ఈ రోజు డిసెంబర్ 23 ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. కైకాల సత్యన్నారాయణ మృతి తో ఇండస్ట్రీ శోక సముద్రంలో మునిగిపోగా.. బాలకృష్ణ దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు, రామ్ చరణ్, చిరు, పవన్ ఇలా అందరూ ఆయన మృతికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కైకాల భౌతిక కాయానికి నివాళు అర్పించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని, ఎమ్యెల్యే గోపినాధ్ వెళ్లారు. ఇంకా ఇండస్ట్రీ నుండి వెంకటేష్, మోహన్ బాబు, చిరు, పవన్, త్రివిక్రమ్ లు వెళ్లారు.
మెగాస్టార్ చిరు.. కైకాలతో తనకున్న అనుబంధాన్ని తలచుకుని ఆయనకి నివాళులు అర్పించే సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత కైకాల కుటుంబ సబ్యులని ఓదారుస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కైకాల సత్యన్నారాయణ భౌతిక కాయానికి నివాళు అర్పించడానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ఆయనకి నివాళులర్పించి అన్నయ్య చిరు పక్కనే కూర్చుని సత్యన్నారాయణ కుటుంబ సబ్యులని ఓదార్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కైకాలకి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా నివాళుల అర్పించడంతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తున్నారు.