కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ పొంగల్ కి తునివుతో తమిళ ప్రేక్షకుల ముందుకు, తెగింపు తో తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. తమిళంలో విపరీతమైన పాపులారిటీ ఉన్న అజిత్.. అక్కడ మరో స్టార్ హీరో విజయ్ వారిసితో పోటీపడుతున్నారు. అక్కడ అజిత్ vs విజయ్ ఫాన్స్ మామూలుగానే కొట్టుకుంటారు. ఇప్పుడు పొంగల్ రేస్ లో ఇద్దరు హీరోలు పోటీపడుతున్నారంటే ఫాన్స్ వార్ ఎలా ఉంటుందో ఊహించుకుంటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక అజిత్ తునీవు తర్వాత నయనతార భర్త విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో సినిమాకి కమిట్ అయ్యారు. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా నయనతారనే నటిస్తుంది అనుకుంటున్నారు. కానీ AK62 లో హీరోయిన్ గా నయన్ నటించడం లేదు.
అజిత్ కుమార్ సరసన AK62 లో త్రిష నటించబోతుంది. ఈమధ్యన పొన్నియన్ సెల్వన్ తో అదరగొట్టేసిన త్రిష అజిత్ సరసన నటిస్తుంది అని తెలుసుకున్న ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్ లో విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో AK62 మూవీ వచ్చే నెల అంటే కొత్త ఏడాది జనవరి రెండో వారం నుండి ముంబైలో మొదలు కాబోతుంది. అజిత్, విగ్నేష్ శివన్ కలయికలో క్రేజీగా తెరకెక్కబోయే ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అజిత్-త్రిష కలయిక అనగానే అందరిలో సినిమాపై ఆసక్తి, అంచనాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక ఈ చిత్రం యాక్షన్ నేపథ్యంలో సాగుతుందా లేదా.. కొత్త జోనర్ ని ట్రై చేస్తారా అని తెలియాల్సిఉంది.