Advertisementt

పవన్ నుండి క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చేశాయ్..

Fri 23rd Dec 2022 11:12 AM
pawan kalyan,christmas  పవన్ నుండి క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చేశాయ్..
Pawan Kalyan & Wife Anna Sending Xmas gifts పవన్ నుండి క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చేశాయ్..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు-సినిమాలు ఇలా రెండు రకాలుగా బిజీ అయ్యారు. ఏపీ రాజకీయాల్లో తన గళం వినిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటూ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసేసారు. ఇక క్రిష్టమస్ వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ భార్య అన్నా తో కలిసి పవన్ కళ్యాణ్ స్నేహితులకి, సన్నహితులకి క్రిష్ట్మస్ గిఫ్ట్స్ పంపిస్తుంటారు. రేపు ఆదివారం క్రిష్ట్మస్ సందర్భంగా పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది కడుఆ ఈ గిఫ్ట్స్ స్నేహితులకి చేరుతున్నాయి.

ఆ బహుమతులపై అన్నా లెజెనోవా, పవన్ కళ్యాణ్ నుంచి ప్రేమతో అంటూ రాసి మరీ ఉంటున్నాయి. సమ్మర్ వస్తే చాలు తమ తోట లోని మామిడి పళ్ళని ప్యాక్ చేసి పంపించే పవన్ కళ్యాణ్ అన్నా ని వివాహం చేసుకున్నాక క్రిష్ట్మస్ కానుకలు పంపిస్తున్నారు. మహేష్-నమ్రతలకి అలాగే తనతో పని చేసే డైరెక్టర్స్ కి బండ్ల గణేష్, నితిన్ లాంటి స్నేహితులకి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ కానుకలు పంపిస్తారు. తాజాగా క్రిష్ట్మస్ కి పవన్ నుండి గిఫ్ట్ అందుకున్న వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఆనందంగా అభిమానులతో పంచుకున్నారు.

వకీల్ సాబ్ తర్వాత పవన్ భీమ్లా నాయక్ చేసారు, హరి హర వీరమల్లు చేస్తున్నారు, ఇంకా రెండుమూడు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. కానీ వేణు శ్రీరామ్ ఐకాన్ ఇంకా అడ్రెస్స్ లేదు.

Pawan Kalyan & Wife Anna Sending Xmas gifts :

Pawan Kalyan and wife Anna send Christmas goodies to friends

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ