కన్నడ నుండి క్యూట్ గా బ్యూటిఫుల్ గా తెలుగు ఇండస్ట్రీలోకి ఓ ప్లాప్ సినిమాతో అడుగుపెట్టిన శ్రీలీల క్రేజ్ ఇప్పుడు తెలుగులో భీభత్సంగా ఉంది. కన్నడ నుండి డాక్టర్ చదువుతూ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోతున్న శ్రీలీల పెళ్లి సందడి సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా కనిపించి ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చెయ్యడమే కాదు యంగ్ హీరోల దృష్టి తనపై పడేలా చేసుకుంది. పెళ్లి సందడి రిజల్ట్ తో సంబంధం లేకుండా శ్రీలీల కి రవితేజ ధమాకాలో ఆఫర్ ఇచ్చాడు. ధమాకా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమె బ్యూటిఫుల్ లుక్స్ కి ఇంప్రెస్స్ అయ్యి రామ్ తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆఫర్ ఇచ్చాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీలో శ్రీలీల హీరోయిన్.
అంతేనా శ్రీలీల కి మరో యంగ్ హీరో నితిన్ కూడా వక్కంతం వంశీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇలా టాలీవుడ్ యంగ్ హీరోలు రెడ్ కార్పెట్ పరుస్తున్న సమయంలోనే బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కి కూతురుగా అదిరిపోయే అవకాశం దక్కించుకున్న శ్రీలీలకి ఈరోజు విడుదలవుతున్న ధమాకా హిట్ అయితే.. మరింతగా పాపులర్ అయ్యి అవకాశాల మీద అవకాశాలు అందుకోవడం ఖాయం. ఇంకా వరుణ్ తేజ్ తో ఓ మూవీ, వారాహి ప్రొడక్షన్ లో మరో మూవీ చేస్తున్నట్లుగా శ్రీలీలే తన కొత్త ప్రోజెక్టుల అప్ డేట్స్ ఇచ్చేసింది.
ఇక నేడు ధమాకా రిలీజ్ సందర్భంగా ఈ క్యూట్ అండ్ స్వీట్ శ్రీలీల అభిమానులు ఆమెని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. హీరోలకే ఎక్కువ స్పేస్ ఉండే సోషల్ మీడియాలో ఓ యంగ్ హీరోయిన్ ఈ విధంగా ట్రెండ్ అవడం చూస్తే.. శ్రీలీల క్రేజ్ మాములుగా లేదురా బాబోయ్ అనుకుంటున్నారు.