ఈ రోజు డిసెంబర్ 22 న కోలీవుడ్ నుండి డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి నయనతార కనెక్ట్, విశాల్ లాఠీ చిత్రాలు. నయనతార కనెక్ట్ కి నయన్ ప్రమోషన్స్ బాగా క్రేజ్ ఆసక్తిని పెంచేసాయి. ఇటు విశాల్ రెండు తెలుగు రాష్ట్రాలలో లాఠీని ప్రమోట్ చేసాడు. అంచనాలు భారీగా లేకపోయినా.. మంచి అంచనాలతో ఈ క్రిష్టమస్ కి అదృష్టాన్ని పరిక్షించుకున్నాయి. ముఖ్యంగా నయనతార లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో సత్తా చాటుతున్న లేడీ సూపర్ స్టార్ కావడం, ఆమె చాలా ఏళ్ళ తర్వాత సినిమాని ప్రమోట్ చెయ్యడం అన్నీ కొత్తగా కనిపించడంతో అందరూ కనెక్ట్ కి కనెక్ట్ అయ్యారు.
నయనతార హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి భయపెడదామనుకుంటే.. ప్రేక్షకులు అసలు భయపడలేదు. ఇక విశాల్ డిటెక్టీవ్, అభిమన్యుడుతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన.. మధ్యలో సామాన్యుడు లాంటి సినిమాలతో కాస్త వెనకడుగు వేసాడు. అయినా లాఠీ ప్రమోషన్స్ తోనే హైప్ క్రియేట్ చేసాడు కానీ.. విశాల్ ని ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. అందులో సినిమాకి నెగటిగేటివ్ టాక్ పడింది. మొదటి షోకే లాఠీ పై ప్రేక్షకులు పెదవి విరిచారు. క్రిటిక్స్ పూర్ రేటింగ్స్ ఇచ్చారు.
అటు నయన్ కనెక్ట్ కి పూర్ రేటింగ్స్ తో క్రిటిక్స్ ఆడియన్స్ ని డిస్పాయింట్ చేసారు. రెండు డబ్బింగ్ సినిమాలు కూడా తుస్ మనిపించాయి. మరి రేపు శుక్రవారం రాబోయే ధమాకా, 18 పేజెస్ పై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ధమాకా కామెడీ ఎంటర్టైనర్ గా, 18 పేజెస్ క్యూట్ లవ్ స్టోరీస్ గా కనిపించడంతో ఆడియన్స్ వాటివైపు మొగ్గు చూపుతున్నారు. మరి డబ్బింగ్ సినిమాలు పోయినా తెలుగు స్ట్రయిట్ సినిమాలు ప్రేక్షకులని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తాయో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.