Advertisementt

ఇంటర్వూస్ కి దూరంగా బిగ్ బాస్ విన్నర్

Thu 22nd Dec 2022 06:18 PM
bigg boss 6,revanth  ఇంటర్వూస్ కి దూరంగా బిగ్ బాస్ విన్నర్
Bigg Boss 6 Revanth winner away from interviews ఇంటర్వూస్ కి దూరంగా బిగ్ బాస్ విన్నర్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 నుండి గ్రాండ్ ఫినాలే రోజు ఎలిమినేట్ అయ్యి రన్నర్ గా, విన్నర్ గా బయటికి వచ్చి యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూస్ తో కంటెస్టెంట్స్ చేసే హడావిడి, హంగామా మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రన్నర్ గా శ్రీహన్, విన్నర్ గా రేవంత్ నిలిచారు. టాప్ 5 నుండి ముందు రోహిత్, తర్వాత ఆది రెడ్డి, తర్వాత కీర్తి ఎలిమినేట్ అయ్యారు. అయితే కీర్తి, రోహిత్, శ్రీహన్, ఆది రెడ్డి విడివిడిగా యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ హౌస్ విషయాలను ముచ్చటిస్తున్నారు.

కానీ సింగర్ రేవంత్ విన్నర్ గా కప్ అందుకుని బయటికి వచ్చాక మీడియా సమావేశం తర్వాత రేవంత్ ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఏ యూట్యూబ్ ఛానల్ లో కనిపించలేదు. ప్రస్తుతం తన కూతురుని మొదటిసారి చూసుకుని మురిసిపోతున్నాడు. డబ్బే ముఖ్యం కాదు, టైటిల్ కొడితే డబ్బు, పేరు అన్ని వస్తాయంటున్నాడు రేవంత్, రేవంత్ తన కూతురిని మొదటిసారి చూసుకుని ఓ చేత్తో టైటిల్, మరో చేత్తో కూతురిని ఎత్తుకుని ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక ఆది రెడ్డి రేవంత్ టైటిల్ విన్ అయ్యినందుకు హ్యాపీగా ఉన్నా మామ అని ట్వీట్ వెయ్యగానే రేవంత్ మామ నీ సపోర్ట్ హౌస్ లో చాలా ఉంది.. నువ్వు నా పక్కనే ఉంటూ నన్ను గెలిపించావ్, నువ్వు కట్టప్పవి.. అది సంతోషంగా చెబుతున్న మాట అంటూ రిప్లైస్ ఇస్తున్నాడు కానీ ఇంకా ఛానల్స్ లోకి అయితే రాలేదు.

Bigg Boss 6 Revanth winner away from interviews:

Bigg Boss 6 winner Revanth first time meet to our baby so beautiful emotional moment

Tags:   BIGG BOSS 6, REVANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ