చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టేసి దానిని మూసేసారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి సీఎం అవుదామని కలలు కన్న మెగాస్టార్ చివరికి రాజకీయాల నుండి తప్పుకుని కామ్ గా సినిమాలు చేసుకుంటుంటే.. రామ్ చరణ్ మాత్రం అభ్యుదయ పార్టీ పెడుతున్నాడు. అభ్యుదయ పార్టీ నుండి ట్రాక్టర్ గుర్తుకే మన ఓటు అంటూ ప్రచారానికి రెడీ అయ్యాడు. అయితే రామ్ చరణ్ పార్టీ పెడుతుంది జస్ట్ RC 15 కోసమే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న RC 15 షూటింగ్ కొత్త షెడ్యూల్ కోసం రాజమండ్రి లోని ధవళేశ్వరం బ్రిడ్జ్ కి సమీపంలో గోదావరి నడిబొడ్డున ఇసుక తిన్నెల్లో ఓ భారీ సెట్ వేశారు.
ఆ సెట్ లో రామ్ చరణ్ పార్టీ మీటింగ్ పెట్టబోతున్నాడు. అభ్యుదయ పార్టీ పోస్టర్స్ తో ట్రాక్టర్ గుర్తుకే మీ ఓటు అంటూ ఎన్నికల ప్రచారం చెయ్యబోతున్నాడు. ఈ షూట్ లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనబోతున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారనే ప్రచారం ఉండగా RC15 నుండి రామ్ చరణ్ లుక్స్ తరుచు లీకవుతున్నట్టుగా, ఇప్పుడు కూడా రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ లుక్ తో పాటుగా ఆయన పెట్టబోయే పార్టీ పేరు, అలాగే ఎన్నికల గుర్తు అన్నీ లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
RC15 అప్ డేట్ లేకుండానే, ఫస్ట్ లుక్ వదలకుండానే చాలా విషయాలు లీకైపోయి బయటకి వచ్చేశాయి. ఈ లీకులు ఆపడంతో దిల్ రాజు వల్ల కావడం లేదు. కానీ ఫాన్స్ లీకైన ఏ అప్ డేట్ ని వదలకుండా వైరల్ చేసిపడేస్తున్నారు.