గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి-షణ్ముఖ్ ల రిలేషన్ పై బయట చాలా రకాల ట్రోల్స్ నడిచాయి. చాలా దారుణమైం కామెంట్స్ పడినాయి. ఆ సీజన్ లో సిరి-షణ్ముఖ్ ల ఫ్రెండ్ షిప్ చాలా వరెస్ట్ గా కనిపించడంతో ప్రేక్షకులు ప్రేమికుల్లా ట్రీట్ చేసారు. వీరిద్దరి బాండింగ్ ని బిగ్ బాస్ యాజమాన్యం హైలెట్ చేసింది. వీరి ఫ్రెండ్ షిప్ వలనే షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన షణ్ముఖ్ కి గుడ్ బై చెప్పేసి బ్రేకప్ చేసుకుంది. ఇక శ్రీహన్ కూడా సీజన్ 6 స్టేజ్ పై షణ్ముఖ్-సిరి ఫ్రెండ్ షిప్ నచ్చక నన్ను వదిలేస్తావా సిరి అంటూ హాట్ కామెంట్స్ చేసాడు. బయటికి వచ్చాక సిరి-శ్రీహన్ కలిసిపోయి కనిపించినా వారి మధ్యన గొడవ జరిగినట్టుగా సిరి ఈమధ్యనే బయటపెట్టింది.
శ్రీహన్ అలిగాడని, తనకి కరోనా వచ్చినప్పుడు మళ్ళీ దగ్గరయ్యాడని చెప్పింది. అయితే ఈ సీజన్ లో శ్రీహన్ కూడా శ్రీ సత్య ఫ్రెండ్ షిప్ చేస్తూ సిరి గురించి మాట్లాడుతూనే శ్రీ సత్య కి హగ్స్ ఇచ్చాడు. ఆ విషయమై శ్రీహన్ కూడా ట్రోల్ అయ్యాడు. కానీ సిరి ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి ఎంటర్ అయ్యి శ్రీహన్ కి ఏదో చెప్పింది. ఫ్రెండ్స్ తో జాగ్రత్త, నీ గేమ్ నువ్ ఆడు అని చెప్పి వెళ్ళగానే శ్రీహన్ లో చేంజ్ వచ్చేసింది. రేవంత్-శ్రీ సత్య పదే పదే శ్రీహన్ మారిపోయాడని చెప్పారు.
తాజాగా శ్రీహన్- శ్రీ సత్య ల ఫ్రెండ్ షిప్ గురించి అడగ్గానే శ్రీహన్ బిగ్ బాస్ హౌస్ లో బాండింగ్ గురించి మట్లాడుతూ హౌస్‌లో మానసికంగా ఒకరికొకరు దగ్గరయ్యే పరిస్థితులు ఉన్నాయని, గత ఏడాది సిరికి కూడా ఇలానే జరిగిందని శ్రీహన్ క్లారిటీ ఇచ్చాడు. శ్రీహన్ శ్రీ సత్యకి దగ్గరవుతున్నాడనే సిరి శ్రీహన్ కి చెప్పగా శ్రీహన్ కూడా తెలివి తెచ్చుకుని టాస్క్ లు బాగా ఆడి ఫ్రెండ్స్ తో డిస్టెన్స్ మెయింటింగ్ చేసి ట్రోఫీకి దగ్గరయ్యాడు. కానీ బై లక్ శ్రీహన్ కి విన్నర్ ట్రోపి కొద్దిలో చేజారి అతని ఫ్రెండ్ రేవంత్ కి దగ్గరైంది.