ఎప్పుడూ లేనిది నయనతార మీడియా ముందు తాను నటించిన కనెక్ట్ సినిమాని తెగ ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే తన భర్త విగ్నేష్ శివన్ నిర్మించిన, తాను నటించిన సినిమాని నయనతార పనిగట్టుకుని ప్రేక్షకుల్లోకి తీసుకువెళుతుంది. అదే వేరే హీరోలతో వేరే నిర్మాణ సంస్థలో పని చేస్తే ప్రమోషన్స్ పని లేదు అన్నట్టుగా బిహేవ్ చేసేది. ఇక కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగముగా నయనతార తాను నటించిన తెలుగు హీరోల గురించి నయనతార ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అందులోను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసే డాన్స్ పై క్రేజీ కామెంట్స్ చేసింది నయన్.
నయనతార-ఎన్టీఆర్ తో కలిసి వినాయక్ దర్శకత్వంలో అదుర్స్ మూవీ చేసింది. అయితే సుమ మాటల సందర్భంలో ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాగా.. దానికి నయనతార చాలామంది హీరోలు డాన్స్ విషయంలో రిహార్సల్స్ లేకుండా డాన్స్ చేస్తామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఒకటి రెండు సార్లయినా రిహార్సల్స్ చెయ్యందే సెట్స్ మీదకి వెళ్లారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. రిహార్సల్స్ చేద్దామా అని డాన్స్ మాస్టర్ అడిగితే అక్కర్లేదు టేక్ కి వెళ్ళిపోదామని చెప్పేస్తారు.
ఒక్కోసారి డాన్స్ మాస్టర్ చెప్పేదానికంటే ఎన్టీఆర్ చాలా బాగా స్టెప్స్ వేస్తారు. ఆలా చెయ్యడం చూసి నేను చాలా ఆశ్చర్యపోతాను, నిజంగా ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అంటూ నయనతార ఎన్టీఆర్ డాన్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.