కన్నడ నుండి మెల్లగా పాన్ ఇండియా భాషలైన తెలుగు, తమిళ , హిందీ భాషల థియేటర్స్ లో ఆడియన్స్ నుండి శెభాష్ అనిపించుకుని ఆహా ఓహో అంటూ కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులని క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి కాంతార ఓటిటిలో మాత్రం అట్టర్ ప్లాప్ షోగా మిగిలిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో హడావిడి లేకుండా, ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చేసిన కాంతారని ఓటిటి ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లు కొల్లగొట్టింది.
కానీ అమెజాన్ ప్రైమ్ లో మాత్రం సందడే లేదు. అమెజాన్ లో విడుదలైనప్పుడు వరాహ రూపం సాంగ్ తీసివేయడం, థియేటర్స్ లో అప్పటికే చాలామంది చూసెయ్యడంతో ఓటిటి రిలీజ్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. లేదంటే అమెజాన్ లో రికార్డ్ వ్యూస్ అంటూ పోస్టర్స్ వెలిసేవి. అసలు ఓటిటిలోకి వచ్చాక కాంతార న్యూస్ ఎక్కడా వినిపించనే లేదు. రిషబ్ శెట్టి మాత్రం హిందీ లో డిబేట్స్ లో పాల్గొంటున్నాడు.
అయితే అమెజాన్ ప్రైమ్ లో వచ్చేముందు కాస్త ప్రమోట్ చేసి ఉంటే ఓటిటి రిలీజ్ కి మంచి రెస్పాన్స్ దక్కేది అంటున్నారు. అలాగే వరాహరూపం సాంగ్ యాడ్ చేసినట్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెబితే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగేది అంటూ.. కాంతార ఓటిటిలో అట్టర్ ప్లాప్ షోగా మిగిలిపోయింది అనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.