Advertisementt

బ్రేకప్ వార్తలపై శృతి హాసన్ రియాక్షన్

Wed 21st Dec 2022 05:49 PM
shruti haasan,santanu  బ్రేకప్ వార్తలపై శృతి హాసన్ రియాక్షన్
Shruti Haasan Reply to Breakup News బ్రేకప్ వార్తలపై శృతి హాసన్ రియాక్షన్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో శృతి హాసన్ చేసిన రెండు సీనియర్ స్టార్స్ చిత్రాలు సంక్రాంతికి విడుదల కావడంతో.. శృతి హాసన్ ట్రెండ్ అవుతుంది. నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ సంక్రాంతి కి శృతి హాసన్ నటించిన బాలయ్య వీర సింహ రెడ్డి, చిరు వాల్తేర్ వీరయ్యలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలకు పోటీ పడడంతో అందరి చూపు శృతి హాసన్ పైనే. అయితే ఈమధ్యన శృతి హాసన్ తన సోషల్ మీడియా పోస్ట్ ల్లో ఆమె హెల్త్ విషయాలతో పాటుగా, తాను ఒంటరిగా ఫీలవుతున్నా అన్నట్టుగా పోస్ట్ లు పెడుతుంది. గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ శాంతానుతో తరుచూ దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ అతనితో తో నిత్యం హడావిడి చేసే శృతి ఈ మధ్యన శాంతను తో కలిసి ఉన్న పిక్స్ ని షేర్ చెయ్యడం లేదు.

శాంతను తో ఉన్న పిక్స్ మాత్రమే కాదు అతని ఊసు కూడా తియ్యకపోవడంతో ఆమె లవ్ బ్రేకప్ అయినట్లుగా ప్రచారం మొదలయ్యింది. అందుకే ఒంటరి తనం ఫీలవుతూ నాతో నేనే ఉంటాను, అదే నాకు సంతోషం, నా విలువైన సమయాన్ని ప్రేమిస్తాను, ఒంటరితనాన్ని ప్రేమిస్తాను అంటూ శృతి హాసన్ ఈ రకమయిన పోస్ట్ లు పెడుతుంది, దానితో నెటిజెన్స్ ప్రస్తుతం శృతి హాసన్ స్టేటస్ సింగిల్ అంటున్నారు. కానీ శృతి హాసన్ ప్రియుడితో బ్రేకప్ వార్తలకి సింగిల్ పోస్ట్ తో చెక్ పెట్టింది.

శాంతను తో కలిసి క్లోజ్ గా దిగిన ఫొటో ని ఇన్స్టా లో షేర్ చేస్తూ నేను ఎల్లప్పుడూ కోరుకునేది ఇదే అంటూ తనకు శాంతను కి బ్రేకప్ అవ్వలేదని, తామెంతో అన్యోన్యంగా ఉన్నామంటూ శృతి హాసన్ ఈ రమైన పిక్ తో క్లారిటీ ఇచ్చింది.

Shruti Haasan Reply to Breakup News:

Shruti Haasan shares adorable pic with beau Santanu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ