పవన్ కళ్యాణ్ అటు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తూ వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడమే కాదు, ఇటు హరి హర వీరమల్లు షూటింగ్ లో కర్ర సాము, యుద్ధ విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ తో హడావిడి చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అమరావతి టు హైదరాబాద్ అన్న రేంజ్ లో క్షణం తీరిక లేకుండా తిరుగుతూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. తాజాగా హరి హర వీరమల్లు నుండి ఫాన్స్ కి గూస్ బంప్స్ వచ్చే అప్ డేట్ బయటికి వచ్చింది.
స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ తన స్నాప్‌ను పవన్ కళ్యాణ్‌తో పంచుకున్నారు. విజయ్ ఆ పిక్ తో పాటుగా హరి హర వీరమల్లులోని పవన్ కళ్యాణ్ పై హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ని క్రిష్ పూర్తి చేసినట్టుగా చెప్పాడు. నిన్న #HariHaraVeeraMallu కోసం ఒక ప్రధాన యాక్షన్ సన్నివేశాన్ని కంప్లీట్ చేశామని, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సహకారంతో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇంత త్వరగా పూర్తయ్యింది అని ఆయన చెప్పారు, ఇప్పుడు తదుపరి సీక్వెన్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభమవుతుంది. అయితే యాక్షన్ సీక్వెన్స్ పూర్తయిన తర్వాత స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ కి పవన్ కళ్యాణ్ జ్ఞాపికను అందజేస్తున్నట్లు కనిపిస్తోంది ఆ పిక్ లో
పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ తలపడుతుండగా.. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించబోతుంది.