Advertisementt

విచిత్రం: ఆర్పీ హోటల్ దగ్గర బౌన్సర్లు

Wed 21st Dec 2022 01:13 PM
kiraak rp,nellore pedda reddy chepala pulusu  విచిత్రం: ఆర్పీ హోటల్ దగ్గర బౌన్సర్లు
Heavy Public at Kiraak RP Nellore Pedda Reddy Chepala Pulusu విచిత్రం: ఆర్పీ హోటల్ దగ్గర బౌన్సర్లు
Advertisement
Ads by CJ

జబర్దస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ లో కామెడీ మానేసాడు. అక్కడ గొడవపెట్టుకున్నాడు. తర్వాత అదిరింది, స్టార మాలో కామెడీ చేసి సినిమా తీద్దామనుకుని బొక్కబోర్లా పడ్డాడు. అయితే ఉన్నట్టుండి కిర్రాక్ ఆర్పీ కూకట్ పల్లి లో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెన్ చేసాడు. ఆ హోటల్ పెట్టిన దగ్గరనుండి యూట్యూబ్ ఛానల్స్ ఆర్పీ చుట్టూ తిరిగాయి. అలా ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫ్రీ పబ్లిసిటీతో ఫెమస్ అయ్యింది. ఇక మనోడు ఆగుతాడా.. ఇదే కాదు 15 బ్రాంచ్ లు ఓపెన్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటూ గొప్పలు పోతున్నాడు.

తనని ఇంటర్వ్యూ చేసేవారికి చేపల పులుసు వడ్డిస్తూ ఆర్పీ హడావిడి చెయ్యడంతో జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. ఇక రీసెంట్ గా ఆర్పీ టెక్ అ వే దగ్గర నెల్లూరు స్పెషల్ చేపల పులుసు కోసం దాదాపుగా 6000 వేలమంది కష్టమర్స్ ఎగబడడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం, జనాలు తోసుకోవడంతో వారిని కంట్రోల్ చెయ్యడానికి ఆర్పీ బౌన్సర్లు ని మెయింటింగ్ చెయ్యడం నిజంగా విచిత్రంగా కనబడుతుంది. ఆర్పీ గత ఇంటర్వూస్ లోను ఇప్పటికే నా కర్రీ పాయింట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పినట్టుగానే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో అక్కడ జరుగుతున్న గొడవని చూసి హమ్మ ఆర్పీ నువ్ మాములోడివి కాదంటున్నారు.

ఇక జబర్దస్త్ కి వెళ్ళను, జబర్దస్త్ కి వెళ్ళేబదులు చేపల పులుసు చేసుకోవడం బెటర్ అంటూ చెప్పడం చూస్తే ఈ చేపల పులుసు క్లిక్ అయితే ఆర్పి కామెడీ షోస్ కి దూరమైనట్టే కనిపిస్తుంది. 

Heavy Public at Kiraak RP Nellore Pedda Reddy Chepala Pulusu:

Kiraak RP Nellore Pedda Reddy Chepala Pulusu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ