Advertisementt

నయనతారలో ఎంత మార్పు

Wed 21st Dec 2022 12:24 PM
nayanthara,connect movie  నయనతారలో ఎంత మార్పు
What a change in Nayanthara నయనతారలో ఎంత మార్పు
Advertisement
Ads by CJ

లేడీ సూపర్ స్టార్ నయనతారలో వచ్చిన మార్పుకి ఆమె ఫాన్స్ ఆశ్చర్యపోతుంటే.. కోలీవుడ్, టాలీవుడ్ లో ఆమెతో నటించిన హీరోలు షాకవుతున్నారు. మరి అంతగా షాకయ్యి, ఆశ్చర్యపోయేంతగా నయనతారలో వచ్చిన మార్పేమిటంటే.. ఆమె ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసినా.. తనపని జస్ట్ వారిపక్కన నటించడం వరకే.. ఆ తర్వాత ప్రమోషన్స్ తో తనకేం పని లేదు అని అగ్రిమెంట్ చేసుకుని మరీ ఆమె ఆ ప్రాజెక్టులోకి అడుగుపెడుతుంది. నిర్మాతలు ప్రమోషన్స్ కోసం సపరేట్ ప్యాకేజ్ ఇస్తామన్నా ఆమె ఒప్పుకోదు. తనకి ప్రమోషన్స్ అంటే సెంటిమెంట్ అంటుంది తప్ప అడుగు ముందుకు వెయ్యదు.

కానీ నయనతార ఆమె సొంత సినిమా కోసం తన సెంటిమెంట్ ని పక్కనబెట్టి ప్రమోషన్స్ చెయ్యడం చూసిన వారు ఔరా నయన్ లో ఇంత మార్పా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తన భర్త విగ్నేష్ శివన్ బ్యానర్ నుండి నయనతార హీరోయిన్ గా నటించిన కనెక్ట్ సినిమా రేపు డిసెంబర్ 22 న విడుదల కాబోతుంది. ఆ సినిమా కోసం నయనతార రంగంలోకి దిగింది. కనెక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా తమిళనాట ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇవ్వడమే కాదు, తెలుగులోనూ ఛానల్స్ కోసం సుమ కి ఇంటర్వూస్ ఇచ్చింది. 

నయనతార కనెక్ట్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ లో తాను నటించిన స్టార్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్ ల గురించి మట్లాడుతూ వారి అభిమానులని సైతం బుట్టలో వేసే ప్లాన్ చేసింది. అసలు ముందు సెంటిమెంట్ సెంటిమెంట్ అనే నయనతార తన సినిమా కోసం ప్రమోషన్స్ చెయ్యడం మాత్రం కొత్తగానూ, వింతగానూ ఉంది.

What a change in Nayanthara:

Shocking: Nayanthara promotions Connect Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ